Begin typing your search above and press return to search.
సింధు బ్రాండ్ విలువ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 27 Aug 2016 5:30 PM GMTసింధు! ఇప్పుడు ఈ పేరు భారత దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వినబడుతోంది! సింధులాగా నువ్వు డెవలప్ కావాలి. సింధులాగా మెడల్స్ సాధించాలి. సింధులాగా దేశానికి మంచి పేరు తేవాలి. తెల్లారిన దగ్గరనుంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్న మాటలు ఇవే!! సింధు అలా రోల్ మోడల్ గా మారిపోవడానికి కారణం ఒలింపిక్స్! ప్రతి నాలుగేళ్లకు ఒక్కసారి జరిగే ఒలిపిక్స్ లో తొలిసారి ఇటీవల రియోలో జరిగిన 2016-ఒలింపిక్స్ లో పాల్లొన్న సింధూ ఎవ్వరూ ఊహించని విధంగా బ్యాట్మింటన్ లో రజత పతకాన్ని సాధించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కనీసం అంత వరకు వెళ్లకపోవడం - ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు కాంస్య పతకాలకే పరిమితమవడం నేపథ్యంలో సింధు సాధించిన విజయం నిజంగానే అందరినీ అబ్బురపరిచింది.
అంతేకాదు, ఫైనల్ లో సింధు.. స్వీడన్ లేడీ ఛాంపియన్ ప్రపంచ నెంబర్ 1 మారిన్ తో తలపడిన తీరు అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దీంతో సింధు రజతం సాధించినా.. స్వర్ణమే అంటూ ఆమెను ప్రతి ఒక్కరూ ఆకాశానికి ఎత్తేశారు. ఏపీ - తెలంగాణ ప్రభుత్వాలైతే.. సింధును పోటీ పడి మరీ సత్కరించడంతోపాటు కోట్లకు కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించాయి. దీంతో సింధు బ్రాండ్ విలువ ఒక్కసారిగా జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఒలింపిక్స్ కు ముందు ఛాంపియన్ గా ఉన్న సింధు బ్రాండ్ విలువ కేవలం రూ.20 లక్షలుగా ఉంది. అయితే, ఇప్పుడు ఆమె ఒలింపిక్స్ లో రజతం గెలవడంతో బ్రాండ్ విలువ సాధారణంగానే పెరిగింది. అయితే, ఏపీ - తెలంగాణ - ఢిల్లీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఈ బ్రాండ్ విలువ మరింత ఎగబాకిందని - సింధు బ్రాండ్ వ్యవహారాలను చూస్తున్న బేస్ లైన్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ తెలిపారు.
ప్రస్తుతం సింధు బ్రాండ్ విలువ 20 లక్షల నుంచి రెండు కోట్లకు పెరిగిందని - అయితే,మరికొద్ది రోజుల్లోనే ఈ విలువ మరింతగా పెరుగుతుందని అన్నారు. కొన్ని కంపెనీలతో డీల్స్ కుదిరాయని వాటి వివరాలు వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఒలింపిక్స్ ముందు కూడా ఆమెకు బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్లు వచ్చినప్పటికీ, తాము ప్రమోట్ చేయాలని భావించలేదని అన్నారు. ఆమె సాధించిన పతకం శాశ్వతమైనది కాబట్టి, సింధూ విలువ మరింతగా పెరుగుతుందని బ్రాండ్ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. ఇప్పటి వరకు ఇంత బ్రాండ్ విలువను తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రీడాకారులూ సాధించలేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దీంతో రేపో మాపో మన టీవీల్లో ఏదో ఒక ప్రొడక్టుతో సింధు మనల్ని ఎంటర్ టైన్ చేయనుందన్నమాట!