Begin typing your search above and press return to search.
పీవీ సింధుకు వరుస షాక్ లు
By: Tupaki Desk | 25 Sep 2019 9:52 AM GMTప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్ షిప్ లో సత్తా చాటిన భారత షట్లర్లు ఆ వెంటనే వరుసగా జరుగుతున్న టోర్నమెంటులలో తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. చైనా - కొరియా టోర్నీలలో జరుగుతున్న మ్యాచ్ లలో వరుసగా ఓటమి పాలవుతున్నారు. ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ షట్లర్ - తెలుగు తేజం పివి.సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. గతవారం చైనా ఓపెన్ లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు బుధవారం జరిగిన కొరియా ఓపెన్ తొలి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసింది.
ఈ టోర్నమెంట్లో సింధు చైనాకు చెందిన క్రీడాకారిణి బీవెన్ జాంగ్ పై 7-21 - 24-22 - 21-15 తేడాతో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. విచిత్రం ఏంటంటే ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ మ్యాచ్ లో ఇదే బీవెన్ జాంగ్ పై సింధు అలవోకగా విజయం సాధించింది. కానీ బుధవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆమె తొలి నుంచి తడబడుతూనే ఆడింది.
తొలి సెట్ ను సులువుగానే గెలుచుకున్న సింధు... తర్వాత రెండు సెట్లలోనూ ఓడి మ్యాచ్ కోల్పోయింది. సింధు ప్రపంచ చాంపియన్ అయిన రెండు వారాలకే రెండు టోర్నమెంటులలో ఓడిపోవడం బిగ్ షాకే అనుకోవాలి. పురుషుల సింగిల్స్ లో ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ కూడా కొరియా ఓపెన్ లో ఇంటిదారి పట్టాడు. ఈ ఇద్దరి ఓటమితో కొరియా ఓపెన్ లో సింధు - సాయి ప్రణీత్ ల ప్రయాణం ముగిసింది. ఇక మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పైనే ఆశలు ఉన్నాయి.