Begin typing your search above and press return to search.

సింధూ త‌న సీక్రెట్‌ ను బ‌య‌ట‌కు చెప్పేసింది

By:  Tupaki Desk   |   28 May 2018 7:32 AM GMT
సింధూ త‌న సీక్రెట్‌ ను బ‌య‌ట‌కు చెప్పేసింది
X
కొన్ని విష‌యాల గురించి మాట్లాడ‌టానికి చాలామంది త‌డ‌బ‌డ‌తారు. అందులో త‌ప్పు లేకున్నా.. ఇలాంటి విష‌యాలు ఓపెన్ గా మాట్లాడ‌తారా? అంటూ విసుక్కుంటారు. చిరాకు ప‌డ‌తారు. అనుమానంగా చూస్తారు. అవ‌మానంగా ఫీల‌వుతారు. ఇంత చేస్తున్న వారు.. ఇంత‌కీ ఎందుకంత ఆగ‌మాగం అవుతార‌న్న‌ది చూస్తే.. చాలా సింఫుల్ మ్యాట‌ర్‌.

మ‌హిళ‌ల‌కు ఒక వ‌య‌సు త‌ర్వాత నుంచి రుతుస్రావం ప్ర‌తి నెలా చోటు చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా వారు మాన‌సికంగా.. శారీర‌కంగా చాలా ఇబ్బందుల‌కు గురి అవుతుంటారు.

చాలా సంద‌ర్భాల్లో ఇలాంటి తిప్ప‌లు త‌మ‌కు మాత్ర‌మేన‌ని మ‌హిళ‌లు వాపోతుంటారు. కానీ.. ప్ర‌కృతి సిద్ధ‌మైన ఈ క్ర‌మాన్ని ఎవ‌రు ఎలా చూస్తే అలా క‌నిపిస్తుంద‌న్న వైనం తాజా ఉదంతంలో అర్థ‌మ‌వుతుంది. బ్యాడ్మింట‌న్ స్టార్.. ఒలింపిక్స్ విజేత పీవీ సిందూ తాజాగా త‌న రుతుస్రావం అంశాన్ని ఓపెన్ గా షేర్ చేసుకున్నారు.

రుతుస్రావంతో ఇబ్బంది ఉన్న‌ప్ప‌టికీ.. ల‌క్ష్య‌సిద్ధికి ఇది ఏ మాత్రం ఆటంకం కాద‌ని ఆమె చెబుతున్నారు. రుతుస్రావం స‌మ‌యంలోనూ తాను త‌న క‌ల‌ను సాకారం చేసుకోవ‌టానికి వెనుకాడ‌న‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు.

తాను మొద‌టిసారి రుతుస్రావం ఎదురైన‌ప్పుడు తాను ఆకాడ‌మీలో ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు చెప్పారు. త‌న సీనియ‌ర్ నుంచి నాచుర‌ల్ ప్యాడ్ తీసుకొని సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసిన‌ట్లు చెప్పారు. త‌న క‌ల‌ను సాకారం చేసుకోవ‌టానికి మొద‌ట్లో చాలా అడ్డంకుల్ని ఎదుర్కొన్నాన‌ని.. రోజు ఇంటి నుంచి బ్యాడ్మింట‌న్ ఆకాడ‌మీకి చేరుకోవ‌టానికి 56 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాల్సి వ‌చ్చేద‌న్నారు.

ఒక‌వైపు నిరంత‌ర శిక్ష‌ణ‌.. మ‌రోవైపు చ‌దువును బ్యాలెన్స్ చేసుకున్నాన‌ని.. పిరియ‌డ్స్ టైంలో మాన‌సికంగా.. శారీర‌కంగా అలిసిపోయినా.. త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించిన‌ట్లు చెప్పారు. రుతుస్రావం స‌మ‌యంలో వ‌చ్చే ప‌లు సందేహాల‌కు చెక్ చెప్పి సింధును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.