Begin typing your search above and press return to search.
మంత్రి మాటకు నో చెప్పేసిన సింధు
By: Tupaki Desk | 25 Aug 2016 4:40 AM GMTసిల్వర్ సింధు ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన సింధుకు జరుగుతున్న సత్కారాల జోరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రులు.. మంత్రులు సహా అంతా ఆమెను అపురూపంగా చూడటం.. ఆమెను కలిసేందుకు ఉత్సుకత ప్రదర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సింధుకు సన్మానం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఒక వ్యాఖ్య చేయటం తలిసిందే. సింధు స్వర్ణం సాధించేందుకు విదేశీ కోచ్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించటం తెలిసిందే.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పలు వాదనలు వినిపించటం.. విదేశీ కోచ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్న ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో సింధు సీన్లోకి వచ్చేసింది. సందేహాల జోరు పెరగకుండా తనదైన శైలిలో సమాధానం చెప్పేసింది.
తన కోచ్ విషయంలో జరుగుతున్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టేసేలా సింధు ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పేశారు. తన వరకూ గోపీచంద్ సార్ బెస్ట్ కోచ్ అని.. మంత్రి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్న ఆమె.. తన కోచ్ గోపీనేనన్న విషయాన్ని చెప్పేశారు. సింధు విజయంలో కీలక భూమిక పోషించిన గోపీని పలువురు అభినందించటమే కాదు.. సింధుకు నజరానాలు ప్రకటిస్తున్న పలువురు గోపీకి కూడా ప్రకటించటం చూస్తేనే అర్థమవుతుంది సింధు విజయంలో గోపీ పాత్ర ఏమిటో..?