Begin typing your search above and press return to search.

నేను రిటైరవుతున్న అన్న పీవీ సింధు.. ఫ్యాన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   2 Nov 2020 5:30 PM GMT
నేను రిటైరవుతున్న అన్న పీవీ సింధు.. ఫ్యాన్స్ ఫైర్
X
భారతదేశం గర్వించే గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మన హైదరాబాదీ అమ్మాయి పీవీ సింధూ సోషల్ మీడియాలో తాను రిటైర్ అవుతున్నానంటూ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ‘డెన్మార్క్ ఓపెన్ ఆఖరిది కావాలి.. నేను రిటైర్ అవుతున్నాంటూ’ తన అధికారిక ట్విట్టర్, ఇన్ స్టా ల్లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. దీంతో షాక్ తిన్న అభిమానులు సింధూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. దీనిపై సింధూ స్పందించారు.

తన రిటైర్ మెంట్ ప్రకటన కరోనా వైరస్ ప్రభావాన్ని గురించి అని.. తన గురించి కాదని పీవీ సింధూ మెలిక పెట్టింది. తన పోస్టును పూర్తిగా చదవాలని ఆమె కోరారు.

నెగెటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నానని.. కరోనా వైరస్ ను ఓడించాలని.. అప్పుడే మన భావితరాల భవిష్యత్తుకు సోపానం అని పీవీ సింధూ రిటైర్ మెంట్ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడే వరకు తాను పోరాడుతూనే ఉంటాను అంటూ పీవీ సింధూ వ్యంగ్య ప్రకటనను చివర్లో ట్విస్ట్ ఇస్తూ ముగించింది.

అయితే మొదట ఉన్న రిటైర్ మెంట్ ను చూసి అభిమానులు కంగారు పడ్డారు. తర్వాత చదువుకొని అభిమానులు పీవీ సింధూపై మండిపడ్డారు.సమయం సందర్భం లేకుండా ఏంటీ వ్యంగ్య పోస్టులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.