Begin typing your search above and press return to search.

షాకింగ్‌!... పీవీ సింధూకు వేధింపులు!

By:  Tupaki Desk   |   4 Nov 2017 9:53 AM GMT
షాకింగ్‌!... పీవీ సింధూకు వేధింపులు!
X
దేశంలో ఆడాళ్ల ర‌క్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు చేస్తున్నా కూడా ఏమాత్రం ఫ‌లితం ఉండ‌టం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ మృగాళ్లు మ‌హిళ‌ల‌పై విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఇక్క‌డా, అక్క‌డా అన్న తేడా లేదు.. సామాన్య మహిళ‌లు, సెల‌బ్రిటీస్ అన్న తేడా కూడా లేదు. మృగాళ్లు రెచ్చిపోతున్నారంతే. నిర్భ‌య ఘ‌ట‌న త‌ర్వాత దేశంలో లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే వారిపై కొర‌డా ఝుళిపించేందుకు క‌ఠిన శిక్ష‌ల‌తో కూడిన చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చినా కూడా వేధింపు రాయుళ్ల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డం లేదు క‌దా... మ‌రింత‌గా పెరిగిపోతోంది. తాజాగా ఈ త‌ర‌హా వేధింపులు స్టార్ ష‌ట్ల‌ర్‌గా ఎదిగిన తెలుగ‌మ్మాయి పీవీ సింధూకు కూడా ఎదుర‌య్యాయి.

ముంబై వెళ్లేందుకు విమానం ఎక్కిన పీవీ సింధూకు ఈ త‌ర‌హా వేధింపులు ఎద‌ర‌య్యాయ‌ని స్వ‌యంగా ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. శనివారం పీవీ సింధు ముంబైకి బయల్దేరింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్‌లోని అజితేష్ అనే వ్యక్తి నుంచి తాను అవమానింపబడ్డానని సింధు చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ విషయమై సింధు మొత్తం మూడు ట్వీట్లు చేసింది. అందులో అసలేం జరిగిందో చెప్పకుండా... తాను ఎక్కిన విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళ‌ను అడిగితే పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని తెలిపింది.

అస‌లు ఆ ఘ‌ట‌న గురించి పీవీ సిందూ చేసిన ట్వీట్ల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... *గ్రౌండ్‌ స్టాఫ్‌ (స్కిప్పర్‌) మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో(నాతో) సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఖ్యాతి దెబ్బతింటుంది* అని ఆమె పేర్కొంది.

దీంతో సింధు ట్వీట్లను చూసిన ఆమె అభిమానులు మాత్రం అజితేష్‌ను క్షమించాలని సలహా ఇస్తున్నారు. అతని ఉద్యోగం పోతుందని, నీ అంతటి స్టార్‌కు చేదు అనుభవాన్ని చూపినందుకు మరెక్కడా ఉద్యోగం లభించకుండా, అతని కుటుంబం రోడ్డున పడుతుందని ట్వీట్లలో పేర్కొన్నారు. క్షమించి వదిలేస్తే సింధూ గొప్పతనం మరింతగా పెరుగుతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసి, అతనిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.