Begin typing your search above and press return to search.
అవినీతిపై జగన్ పోరాటం..రంగంలోకి పి.వి.సింధు
By: Tupaki Desk | 25 Feb 2020 1:55 PM GMTఆంధ్రప్రదేశ్ లో అవినీతికి అవకాశమే లేకుండా చూస్తానంటున్నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ఫిర్యాదు చేయడం కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నంబర్‌కు వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై అవినీతి నిరోధక అధికారులు స్పందించి చర్యలు కూడా చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన టోల్ ఫ్రీ నంబర్ 14400 గురించి గట్టిగా ప్రచారం చేయాలని భావించిన జగన్ సర్కారు దానిపై ఓ వీడియోను కూడా రూపొందించింది. ఈ వీడియోను బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు మీద రూపొందించడం విశేషం. ‘‘ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారు.. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతు వినిపించండి. వెంటనే 14400 అనే టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారమివ్వండి’’ అంటూ వీడియోలో సింధు పిలుపునిచ్చింది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ అవినీతి వ్యతిరేక పోరాటం గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని.. చట్టవ్యతిరేక కార్యకలాపాలు - ఇసుక మాఫియాకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని..రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పారు.