Begin typing your search above and press return to search.
సింధూ చేజారిన స్వర్ణం
By: Tupaki Desk | 5 Aug 2018 11:11 AM GMTప్రపంచ చాంపియన్ షిప్ లో తొలి పసిడి పతకం సాధించాలని కలలు గన్న సింధు కల ఒక్క అడుగుదూరంలో చెదిరిపోయింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో సింధూ ఓడిపోయింది. పైనల్లో కరోలినా మారిన్ చేతిలో 21-19 - 21-10 తేడాతో కేవలం రెండు సెట్లలోనే ఎలాంటి ప్రతిఘటన ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో రెండోసారి కూడా సింధు రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆదివారం చైనాలోని నంజింగ్ లో జరిగిన ఫైనల్ లో తొలి సెట్ లో కరోలినాకు సింధు గట్టిపోటీనిచ్చింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన తొలిసెట్ తరువాత మ్యాచ్ పూర్తిగా మారిన్ చేతిలోకి వెళ్లిపోయింది.
ఇక రెండో సెట్ లో కూడా మొదట హోరా హోరీ గా కనిపించినా.. కాసేపటికే కరోలినా తిరుగులేని ఆదిపత్యాన్ని చాటి సునాయసంగా గెలుపొందింది. ఈ గెలుపుతో మారిన్ వరుసగా రెండోసారి సింధూపై విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ గా అవతరించింది.
ఇంతకుముందు 2016లో రియో ఒలింపిక్స్ ఫైనల్స్ లో వీరిద్దరూ తలపడ్డారు. అప్పుడు కూడా కరోలినా విజయం సాధించి పసిడి పతకం సాధించింది. ఈసారి కూడా అదే పునరావృతమైంది.