Begin typing your search above and press return to search.
బ్యాక్ సీట్లు పెంచటం కాదంటూ పీవీపీ ట్వీట్!
By: Tupaki Desk | 15 July 2019 7:23 AM GMTఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు ఇష్టారాజ్యంగా తిట్టేసుకోవటం మామూలే. కానీ.. తెలుగుదేశం పార్టీలో ఈ తీరు కాస్త తక్కువే. ఏమైనా ఉన్నా.. నర్మగర్భంగా అనుకోవటమే కానీ సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా తిట్టేసుకోవటం.. మాటలు అనేసుకోవటం తక్కువే.
ఇందుకు భిన్నంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ నేతు బుద్ధా వెంకన్నలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న వైనం సంచలనం మారిన సంగతి తెలిసిందే. వీరిరువురికి ఒకేసారి హోల్ సేల్ పంచ్ ఇచ్చేలా ఘాటు ట్వీట్ చేశారు ప్రముఖ సినీ నిర్మాత కమ్ రాజకీయ నేత పొట్టూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ.
బల్లలు అరిగేలా కూర్చొని బ్యాక్ సీట్లు పెంచటం కాదు.. మిమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? లేదా? ఏది ఏమైనా మీరిద్దరూ చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ ఓడిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేతలు ఇద్దరు ఇష్టారాజ్యంగా తిట్టుకుంటూ సంచలనంగా మారిన సమయంలో.. ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చి ఒక ట్వీట్ తో అందరి దృష్టి తనపై పడేలా చేసుకోవటంలో పీవీపీ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.