Begin typing your search above and press return to search.
కేశినేనికి పీవీపీ కొత్త పేరు అదిరిందిగా...!
By: Tupaki Desk | 23 July 2019 8:49 AM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల కాలంలో ట్వీట్లతో చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఏ పార్టీ నాయకుడైనా ప్రత్యర్థులపైనా - ప్రత్యర్థి పార్టీపైనా విమర్శలు చేస్తుంటారు. అయితే, నాని దీనికి భిన్నంగా సొంత పార్టీపైనా - సొంత పార్టీ నేతలపైనా ఆయన గుప్పిస్తున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండో సారి విజయవాడ ఎంపీగా గెలిచిన జోష్ లో ఉన్న నాని.. అదే సమయంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనే ఆవేదనతోనూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలపై ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
అయితే, ఈ విషయంలో తనకు సంబంధం లేదని తెలిసి కూడా బీసీ వర్గానికి చెందిన టీడీపీ విజయవాడ అధ్యక్షుడు - ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జోక్యం చేసుకోవడంతో నాని నేరుగా బుద్దా పైకూడా తన విమర్శలను సంధించారు. ప్రబుద్ధుడు అని ప్రారంభించి ఘాటుగానే విమర్శలు చేశారు. కొబ్బరి చిప్పల దొంగ - సెకిలు బెల్లుల దొంగ అంటూ పరుషంగా విమర్శలు గుప్పించారు. అదే సమయంలో పది ఓట్లు - పది మంది సపోర్టు కూడా లేనివారు విమర్శలు చేస్తున్నారు మనం దౌర్భా గ్యం అంటూ కడిగి పారేశారు.
ఇది రెండు మూడు రోజుల పాటు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయవాడ నుంచి వైసీపీ తరఫున తొలి సారి పోటీ చేసి ఓడి పోయిన పొట్లూరి వీర ప్రసాద్ ఉరఫ్ పీవీపీ మాల్స్ అధినేత - ప్రముఖ సినీ నిర్మాత నాని వర్సెస్ బుద్దా ఎపిసోడ్ లో వేలు పెట్టారు. `` మన కింగ్ కాంగ్ (కేశినేని నాని)కు పదివేల ఓట్లు సాధించి పెట్టిన ప్రబుద్ధుడు`` అంటూ ఆయన తాజాగా చేసిన ట్వీట్ కలకలం రేపింది. అంటే బుద్ధా.. రాజకీయంగా ఎందుకూ పనికిరాని వాడని పేర్కొన్న నానికి కౌంటర్‌గా బుద్దా వల్లే నీకు పది వేల ఓట్లు వచ్చాయని పేర్కొంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
ఇది ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ట్వీట్లతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నానికి ఇప్పుడు పీవీపి చేసిన ట్వీట్ మరింత మంటపుట్టించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం ఖాయమని - వర్షాకాలంలోనూ విజయవాడ రాజకీయాలు వేడెక్కడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.