Begin typing your search above and press return to search.
కేశినేని నాని ఓ పంగనామాల రాజా
By: Tupaki Desk | 28 July 2019 4:53 AM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని - వైసీపీ నేత పీవీపీ మధ్య ట్విట్టర్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ముందుగా నాని వర్సెస్ టీడీపీకే చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ప్రారంభమైన ఈ వార్ లో పీవీపీ దూరడంతో వార్ మరింత రంజుగా మారిపోయింది. చివరకు ఈ వార్ నుంచి పార్టీ ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్న సైలెంట్ అయిపోగా ఇప్పుడు నాని వర్సెస్ పీపీపీ ట్విట్టుకుంటున్నారు.
నాని ఈ రాజకీయ వ్యవస్థలో తాను తప్ప అందరూ చెడ్డవాళ్లే అన్నట్టుగా ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు. ఇటు పీవీపీ కూడా నానికి చాలా ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ బాధితులు (నాని ట్రావెల్స్ లో పనిచేసి జీతాలు రాని వారు) తాజాగా తమ జీతాలు ఇవ్వాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వీళ్లకు కమ్యూనిస్టులు అండగా ఉండడంతో నానికి కోపం వచ్చినట్లుంది. వెంటనే నాని మరో ట్వీట్ వేసేశాడు.
కమ్యూనిస్టులను టార్గెట్ గా చేసుకుని కమ్యూనిస్టులను కిరాయి పార్టీలు అంటూ అభివర్ణించారు. వెంటనే పీవీపీ పండిట్ నెహ్రూ లాంటి బలమైన యోధులనే ఢీకొట్టిన కమ్యూనిస్టులు ఎంతో ఘనమైన దోపిడీ చరిత్ర కలిగిన కోన్ కిస్కాగాడితో యుద్ధం చెయ్యాల్సి వస్తోంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని పీవీపీ ఆదివారం మరో ట్వీట్‌తో నానిని ఏకేశారు.
సొల్లు వాగుడు - రంకు ట్వీట్లు - కట్టు కధలు పుట్టించే ఓ పంగనామాల రాజా.. Learn the essence of life అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే నానిని అనేక పేర్లు పెట్టిన పీవీపీ తాజాగా పంగనామాల రాజా అనే పంచ్ పేల్చారు. మరి నాని నుంచి దీనికి ఎలాంటి కౌంటర్ వస్తుందో ? చూడాలి. ఏదేమైనా నానిపై పీవీపీ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. నానిపై చాలా దూకుడుగా వెళుతోన్న పీవీపీ చివరకు ఈ ట్వీట్ల యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశాన్రా బాబు అని నాని అనుకునేలా విరుచుకుపడుతున్నాడు.