Begin typing your search above and press return to search.
కేశినేని సొల్లు కబుర్లు వద్దు... ముందు వాళ్ల జీతాలు ఇవ్వు
By: Tupaki Desk | 17 July 2019 9:01 AM GMTగత నాలుగైదు రోజులుగా బెజవాడ టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న డ్యూయల్ ఫైట్ కాస్తా... ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. అయిదారు రోజులుగా నాని వర్సెస్ బుద్ధా వెంకన్న మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. చివరకు ఈ వివాదంలో టిడిపి అధిష్టానం జోక్యం చేసుకుని ట్వీట్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని సూచించింది. వెంకన్న సద్దుమణిగినా నాని మాత్రం వెంకన్న చేసిన ట్వీట్ కు రీ కౌంటర్ చేస్తూనే ఉన్నారు.
ఇక వీరిద్దరి వివాదంలోకి నానీ పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దూరేశారు. పీవీపీ రెండు రోజుల క్రితమే నాని వర్సెస్ వెంకన్న వార్ ముదిరి పాకాన పడుతోన్న టైంలో పార్లమెంటులో సీట్లు అరిగేలా పిర్రలు పెంచడమేనా ? మిమ్మలను ఎన్నుకున్న ప్రజలకు చేసేదేమైనా ? ఉందా ? అని నానిని టార్గెట్‌గా చేసుకుని కౌంటర్ వేశారు.
ఇక వెంకన్న ఈ నెల 14న ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టాడని నాని పై చేసిన కామెంట్‌కు మంగళవారం నాని కౌంటర్ ఇచ్చారు. తనపై ఓ ప్రబుద్ధుడు ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టాడని కామెంట్ చేశాడని... తాను నంబర్ ప్లేట్లు మార్చి ట్రావెల్స్ వ్యాపారం చేసినా, అప్పులు తిరిగి చెల్లించకపోయినా 88 సంవత్సరాలు ఉన్న కేశినేని ట్రావెల్స్ ఎందుకు మూసుకుంటానని ప్రశ్నించారు.
ఈ ఇద్దరి వివాదంలోకి దూరిన పీవీపీ నాని పై వెటకారంగా కౌంటర్ చేశారు. పీవీపీ ట్వీట్‌లో ‘ఆ రోజుల్లో ఆస్తులు అమ్మి స్వాతంత్య్ర సమర యోధులు పోరాటాలు చేసి ప్రజాసేవ చేశారు. ఆస్తులు అమ్మాను అని సొల్లు కబుర్లు వద్దప్ప !! ఊరంతా కోడై కూస్తుంది, మీ ప్ర"బుద్ధుడి"తో సహా !! కాస్త కూడు లేని కార్మికులకు వాళ్లకు కట్టవలసిన జీతాలు కట్టవయ్యా మగడా!!’ అని ట్వీట్ చేశారు.
పీవీపీ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండానే వ్యాపారాన్ని మూసేసిందన్న అర్థం స్పష్టమైంది. ఇక రెండేళ్ల క్రితమే నాని తన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే.