Begin typing your search above and press return to search.
చంద్రబాబు 2014లో ఈవీఎంలతో గెలవలేదా?
By: Tupaki Desk | 13 April 2019 5:03 PM GMTవిజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ తన ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేసిన ఒక ఎంపీపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. విజయవాడ సిటింగ్ ఎంపీ - టీడీపీ నేత కేశినేని నాని గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీతో పాటు టీవీ 5 - మహా న్యూస్ లపైనా పరువు నష్టం దావా వేస్తానన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
ఒక్కొక్కరిపై రూ.100 కోట్లకు దావా వేస్తానని తెలిపారు. కోల్ గేట్ స్కాంలో సీబీఐ తనపేరును చార్జిషీటులో పొందుపరచకపోయినా ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గతంలో చంద్రబాబు తనపై కోల్ గేట్ కుంభకోణంలో ఆరోపణలు చేశారని పీవీపీ మండిపడ్డారు. ఆ కుంభకోణంలో ఉన్నది వై.హరిశ్చంద్రప్రసాద్ అయితే - ఆయనకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబేనని తెలిపారు. సీబీఐ చార్జిషీటులో తన పేరు లేకపోయినా తననే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు డిక్షనరీలో యూటర్న్ అనే పదానికి అసలైన అర్థం చంద్రబాబేనని మండిపడ్డారు. ఈవీఎంలు లోపభూయిష్టం అని ఎలుగెత్తుతున్న చంద్రబాబు - 2014లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినప్పుడు ఉన్నది ఇవే ఈవీఎంలు కాదా? ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? అని పీవీపీ ప్రశ్నించారు.