Begin typing your search above and press return to search.
కేశినేని నాని కమలనాథుడు కావటం తప్పదా?
By: Tupaki Desk | 16 July 2019 6:23 AM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయనకు సంబంధించిన పలు విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఎంపీగా ఐదేళ్లు వ్యవహరించినా.. సోషల్ మీడియా జోలికి వెళ్లని నాని.. అందుకు భిన్నంగా రెండోసారి ఎంపీగా గెలిచింది మొదలు పోస్టులతో కలకలం రేపుతున్నారు.
ఆకలి రుచి ఎరగదన్నట్లుగా.. కొత్త అలవాటు కావటమో.. లేదంటే తనకు తానుగా ఒక సోషల్ ఇమేజ్ ను తెచ్చుకోవాలనుకున్నారో కానీ.. ఆయన ఎడాపెడా పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తూ సంచలనంగా మారుతున్నారు. అసలే కేశినేని నాని.. మాట కాస్త దూకుడు ఎక్కువ. ప్రత్యర్థులపైన నోరు పారేసుకునే ఆయన వ్యవహరం ఇప్పుడు సొంతపార్టీ వాళ్ల మీదా ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఆయనకు కొత్త చిక్కు వచ్చి పడిందంటున్నారు. ఎన్నికల వేళ తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే కేశినేని మాటలు కొన్ని డ్యామేజింగ్ గా ఉంటాయి.
తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి మరింకేమీ అక్కర్లేదన్నట్లుగా ఉండే నాని తీరుపై ఆయన రాజకీయ ప్రత్యర్థి పీవీపీ సీరియస్ గా ఉన్నారట. మొన్నజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి నాని.. పీవీపీలు తలపడటం తెలిసిందే . తనపై అడ్డగోలు ఆరోపణలు చేసిన నానిపై పీవీపీ లీగల్ ఫైట్ షురూ చేయనున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనపై అదే పనిగా విమర్శలు చేస్తున్న నానిని ఉద్దేశించి పీవీపీ హెచ్చరించటం తెలిసిందే. తన మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే లీగల్ గా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి తగ్గట్లే.. తాజాగా నానిపై న్యాయపోరాటానికి పీవీపీ సిద్ధమవుతన్నట్లు చెబుతున్నారు. మొండితనంలో పీవీపీకి మించినోళ్లు లేరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఎన్నికల వేళలో తనపై అడ్డగోలు వాదనలు చేసిన నానిపై పలు లీగల్ నోటీసులు ఇచ్చే దిశగా పీవీపీ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే నానికి బీజేపీకి వెళ్లటానికి మించిన అవకాశం మరొకటి ఉండదు. తాజా పరిణామాలు చూస్తే.. కేశినేని నానిని పార్టీలో చేరాలని బీజేపీ నేతలు అడగనక్కర్లేదని.. ఆయనే అడిగి మరీ చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.