Begin typing your search above and press return to search.

విచార‌ణ‌కు డుమ్మా కొట్టి ట్వీట్లు చేస్తున్న పీవీపీ

By:  Tupaki Desk   |   26 Jun 2020 2:30 PM GMT
విచార‌ణ‌కు డుమ్మా కొట్టి ట్వీట్లు చేస్తున్న పీవీపీ
X
ఓ ఇంటి నిర్మాణం విష‌యంలో త‌ల‌దూర్చి ప‌రువు పోగొట్టుకున్న పారిశ్రామిక‌వేత్త‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) గురువారం పోలీసుల విచార‌ణ నుంచి త‌ప్పించుకున్నారు. వాస్త‌వంగా పోలీస్‌స్టేష‌న్‌కు రావాల్సి ఉండ‌గా గైర్హాజ‌ర‌య్యారు. అయితే ఆయ‌న అదృశ్య‌మైనా ఆన్‌లైన్‌లో మాత్రం ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇంటి నిర్మాణం.. బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యంపై త‌న ట్వీట‌ర్‌లో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ‘‘తప్పును తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న'' అంటూ వివాదంపై వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

వివాదంపై స్పందించాల్సి ఉండ‌గా అది కాకుండా హ‌ఠాత్తుగా జ‌గ‌న్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేశారు. ఏపీలో వైర‌స్ కట్టడికి ప్ర‌భుత్వం అవలంభిస్తున్న పద్ధతులపై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆంగ్రూ ప్లెమింగ్ ప్ర‌శంసించారు. ఇది అన్ని మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పీవీపీ స్పందించారు.

‘‘ఏపీ సీఎంను చూసి ఆసియా-ఆస్ట్రేలియా దేశాలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది''అని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం విధానాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలంటూ పీవీపీ ట్వీట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ఏపీలో ప్రతి 50 మందిని మ్యాపింగ్ చేస్తూ, కరోనాకు అడ్డుకట్ట వేస్తున్న విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోనే అమలవుతున్నదని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.