Begin typing your search above and press return to search.
యాస మార్చి మరీ పంచ్ వేసిన పీవీపీ
By: Tupaki Desk | 30 July 2019 11:41 AM GMTసమయానికి తగినట్లుగా స్పందించే అలవాటు కొందరు నేతలకు ఉంటుంది. అందుకు భిన్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్. అవకాశాల్ని తనకు తాను కల్పించుకొని ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యవహరిస్తుంటారు పీవీపీ. ఇటీవల కాలంలో ఆయన సంధించిన ట్వీట్లు వైరల్ గా మారటమే కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నాయి.
తాజాగా అదే తరహాలో పీవీపీ ఒక ట్వీట్ పంచ్ సంధించారు. కాకుంటే.. రోటీన్ కు భిన్నంగా తన యాసను మార్చి వేసిన పంచ్ ఇప్పుడు అందరి చూపు తన మీద పడేలా చేసుకుంటున్నారు. కొంతమంది తాము టాటా సంస్థను ఏపీకి తెచ్చుకుంటున్నట్లుగా డబ్బాలు కొట్టుకోవటం విడ్డూరంగా ఉందన్నారు.
టాటాల్ని తామే తెచ్చామని చెప్పటం సరికాదన్నారు. కార్పొరేట్ సోషల్ రెప్సాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఏపీకి వచ్చి సేవ చేస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే వారు కాస్త ఓపికతో ుండాలని.. త్వరలోనే మార్పులు వస్తాయన్నారు. వైద్య విద్యలో మార్పుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా టాటాను తానే తెచ్చానని డబ్బా ఎంటప్పా? సీఎస్ ఆర్ కింద అన్ని కంపెనీలు చేయాల్సిన సామాజిక సేవ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ అనే సంచలనం దేశంలో మన దగ్గరే మొదలైందన్న ఆయన.. కొనఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవిని ఇచ్చి పూర్వవైభవాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకురానున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. జర.. ఓపిక పట్టు తమ్మీ అంటూ తాజాగా పీవీపీ సంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. యాస మార్చి ప్రత్యర్థులకు ట్వీట్ పంచ్ వేసిన ఆయన తీరు ఇప్పుడు సంచలనమైంది.