Begin typing your search above and press return to search.
పీవీపీ ట్వీట్ల దాడి.. కేశినేని ఎన్ కౌంటరే..!!
By: Tupaki Desk | 4 Aug 2019 7:20 AM GMTవిజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని - వైసీపీ నేత పీవీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ట్విట్టర్ గా సాక్షిగా వీరి పంచులు కాక రేపుతున్నాయి. విజయవాడ ఎంపీ బరిలో టీడీపీ నుంచి నాని - వైసీపీ నుంచి పీవీపీ పోటీపడ్డారు. అప్పటి నుంచే వీరి మధ్య లొల్లి మొదలైంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం కొనసాగినా పీవీపీ మాత్రం నాని చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇక టీడీపీ ఎంపీగా గెలిచిన నాని సోషల్ మీడియాలో పంచులతో ప్రతాపం చూపిస్తున్నారు. బ్యాంకులను ముంచిన పీవీపీ ఆర్థిక నేరస్థుడు అంటూ తొలుత నోరు జారి కేశినేని నాని కౌంటర్ యాటక్ మొదలు పెట్టాడు. దీనికి ఎన్ కౌంటర్ గా పీవీపీ ప్రతీదాడి షూరూ చేశారు. దీంతో సోషల్ మీడియా సాక్షిగా వీరి మాటల యుద్ధం కొనసాగుతోంది.
తాజాగా పీవీపీ వరుస ట్వీట్లతో నానిని కడిగిపారేశారు. కేశినాని నానికి ఇస్మార్ట్ నాని అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అమెరికా వీధుల్లో పాప్ కార్న్ తింటూ బతుకుతుంటే.. కేశినేని మాత్రం బెజవాడను దివాళా తీయిస్తున్నారని అన్నారు.
కెనరా బ్యాంక్ వద్ద 148 కోట్లు అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో పీవీపీ ఆస్తుల వేలానికి ఇటీవల కెనరా బ్యాంక్ ప్రకటన ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకొనే తాజాగా కేశినేని నాని ‘పీవీపీ ఆర్థిక నేరస్థుడు’ అంటూ ట్విట్టర్ లో కడిగిపారేశాడు. దీనిపై పీవీపీ కూడా కౌంటర్ ఇచ్చాడు. టీడీపీ నేతలలాగా ఆర్థిక నేరాలకు పాల్పడి కాషాయ కండువా వేసుకోవడం లేదని.. సొంత వ్యాపారాలను మూసివేసి నమ్ముకున్న కార్మికులను రోడ్డున పడేయలేదని పీవీపీ కౌంటర్ ఇచ్చారు.
ఇక చంద్రబాబుపై కూడా పీవీపీ సెటైర్లు వేశారు. హెరిటేజ్ పాలు పంపిస్తే బారులు తీరిన అప్పుల వాళ్లకు ఒక కప్పు కాఫీ ఇస్తానని పీవీపీ ట్వీట్ లో దెప్పి పొడిచారు. టీడీపీ నేతల నుంచి ఈ సినిమాలు రాబోతున్నాయంటూ ఎద్దేవా చేశారు. వెన్నుపోటు వేటగాడు.. కొండవీటి శునకం - బొబ్బిలి పిల్లి - సర్ధార్ పప్పలరాయుడు - మాయా దేశం తదితర సినిమాటిక్ డైలాగులకు టీడీపీ నేతల పేర్లు పెడుతూ విమర్శలు గుప్పించారు.
ఇలా కేశినేని నాని వర్సెస్ పీవీపీ ట్వీట్ల వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇద్దరూ పరుష ట్వీట్లతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.