Begin typing your search above and press return to search.
విజయవాడ వైసీపీ టికెట్ విషయంలో అసలైన ట్విస్ట్!
By: Tupaki Desk | 12 March 2019 7:06 AM GMTప్రస్తుత రాజకీయంలో కొన్ని సీట్ల విషయంలో ఆఖరి నిమిషం వరకూ అభ్యర్థుల ఖరారు అంశంలో ఎలాంటి ట్విస్టులు అయినా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేందుకు ఇదీ ఒక ఉదాహరణ. నిన్నటి వరకూ విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో వైసీపీలో వినిపించిన పేర్లు వీరు, ఇప్పుడు తెరపైకి వస్తున్న అభ్యర్థి వేరే! విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్… షార్ట్ ఫార్మ్ లో పీవీపీగా ఫేమస్ అయిన వ్యాపారవేత్తకు ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
రేపు ఆయన జగన్ ను కలవనున్నారని.. ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్నటి వరకూ విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీలో దాసరి బాలవర్ధన్ రావు పేరు వినిపించింది. ఆయన ఇటీవలే ఆ పార్టీలో చేరారు.
అయితే ఇప్పుడు పీవీపీకి టికెట్ ఖరారు కావడం విశేషం. మరి దాసరి కుటుంబానికి వేరే టికెట్ ఏదైనా ఇస్తారా - లేదా.. అనే విషయం గురించి ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి అయితే పీవీపీకి టికెట్ ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
రాజకీయ - సినీ వార్తలను గమనించే వారికి పీవీపీ కొత్త ఏమీ కాదు. పలు సినిమాలకు నిర్మాతగా పేరుంది. వ్యాపారవేత్త. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న కమ్మ సామాజికవర్గం వ్యక్తి. అలాగే జనసేన ఆవిర్భావం సమయంలో ఆ పార్టీ కోసం బాగా పెట్టుబడులు పెట్టారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే గత ఎన్నికల్లో అటు జనసేన పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేయలేదు - ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునా బరిలోకి దిగలేకపోయారు. ఇప్పుడు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఖాయమైనట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.