Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స‌భ‌కు రాష్ట్ర మంత్రి మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   8 Sep 2016 11:29 AM GMT
ప‌వ‌న్ స‌భ‌కు రాష్ట్ర మంత్రి మ‌ద్ద‌తు
X
సీమాంధ్రు ఆత్మగౌరవం పేరుతో జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించనున్న స‌భ ఏపీ పాలిటిక్స్‌ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొద‌టి స‌భ నిర్వ‌హించిన స‌మ‌యంలో అధికార - ప్ర‌తిపక్షాల‌నే తేడా లేకుండా ప‌వ‌న్ అన్ని పార్టీల‌పై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ రెండో స‌భ‌పై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ప‌వ‌న్ స‌భ‌కు ఒక్క‌రోజు స‌మ‌యం మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ఏపీ మంత్రి తాను జ‌న‌సేనాని స‌భ‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే త‌న మ‌ద్ద‌తు వ్య‌క్తిగ‌త‌మేన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఇలా బ‌హిరంగంగా ప‌వ‌న్ స‌భ‌కు మ‌ద్ద‌తు తెలిపింది ఏపీ దేవాదాయ శాఖా మంత్రి - బీజేపీ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల రావు. అంతేకాదు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ కు ప్ర‌భుత్వంలో ఓ ప‌దవి కూడా ఇప్పిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌ ఆత్మ‌గౌర‌వ స‌భ ఏపీ ప్ర‌జ‌ల కోసం ఏర్పాటుచేసింది కాబ‌ట్టి తాను వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు తెలిపారు. ఇక తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీపై మాణిక్యాల‌రావు స్పందిస్తూ... కేంద్రం ఏపీ అభివృద్ధి కోసం కృషిచేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా కంటే ప్యాకేజీ మేల‌నే అభిప్రాయం త్వ‌ర‌లోనే నిజ‌మ‌వుతుంద‌ని జోస్యం చెప్పారు.మరోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌కు బంపర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మంచి స‌ల‌హాలు ఇస్తే జ‌గ‌న్‌ కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మింప‌చేసి మంచి వేత‌నం కూడా ఇస్తామ‌ని వ్యాఖ్యానించారు.