Begin typing your search above and press return to search.

ఈ మొగుడు కొట్టుడు మాటలేంది పైడికొండల..?

By:  Tupaki Desk   |   15 Feb 2016 4:34 AM GMT
ఈ మొగుడు కొట్టుడు మాటలేంది పైడికొండల..?
X
ఏదో చెప్పబోయి మరేదో చెబితే ఎంత అభాసుపాలు కావాలో.. ఏపీ మంత్రి.. బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అయ్యేలా తాజాగా ఒకవ్యాఖ్య చేశారు. మహిళలు మరింత వృద్ధి చెందాలన్న ఉద్దేశంలో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లు చెప్పాల్సిన ఒక మాటకు భిన్నంగా మరేదో మాట చెప్పిసి నాలుక్కర్చుకున్నారు. అంతలోనే సర్దుకున్నప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇంతకీ పైడికొండల చేసిన వ్యాఖ్య ఏమిటంటే..?

‘‘మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే పెళ్లాం వంట చేసి పెడుతుంది. మనం ప్రాధేయపడే స్థాయి నుంచి భయపెట్టే స్థాయికి ఎదగాలి’’ అంటూ చెబుతుండగా.. ఒక మహిళా నేత అడ్డుపడి.. ఆయన వ్యాఖ్యను సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. ‘‘పెళ్లాం గరిటె తిరగేసినా మెగుడు భయపడతాడు’’ అంటూ కవర్ చేశారు. అయినా.. మొగుడు పెళ్లాలు చక్కటి సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలని.. సుఖంగా.. సంతోషంగా ఉండాలన్న మంచి మాటలు చెప్పాల్సింది పోయి.. సంబంధం లేని విధంగా ఈ కొట్టుడు మాటలేందో పైడికొండల వారికే తెలియాలి. కలసి కాపురం చేయాల్సిన మెగుడు పెళ్లాల గురించి తిట్లు.. కొట్లాడాలని చెప్పటం ఏమిటో..?