Begin typing your search above and press return to search.

ఏడాది జైలుకు గుర్మీత్ అలా త‌యార‌య్యాడ‌ట‌!

By:  Tupaki Desk   |   25 Aug 2018 9:29 AM GMT
ఏడాది జైలుకు గుర్మీత్ అలా త‌యార‌య్యాడ‌ట‌!
X
భూలోక స్వ‌ర్గం లాంటి సౌక‌ర్యాలు.. కోరుకున్న‌ది సొంతం చేసుకునే త‌త్త్వం.. ప్ర‌జ‌ల విశ్వాసాలు.. న‌మ్మ‌కాల స్థానే ఎన్ని అరాచ‌కాలు చేయొచ్చో.. అన్ని ఆరాచ‌కాలు చేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన డేరా గురు గుర్మీత్ రామ్ ర‌హీం గుర్తున్నాడా? అత‌గాడిని అదుపులోకి తీసుకోవ‌టానికి పోలీసులు పెద్ద యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింది.

అత‌గాడిని అదుపులోకి తీసుకున్నార‌న్న కార‌ణంగా చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. చివ‌ర‌కు కోర్టు కార‌ణంగా 20 ఏళ్ల జైలుశిక్ష‌ను అనుభవించేందుకు జైలుకు వెళ్లిన అత‌గాడికి ఈ రోజుతో ఏడాది గ‌డుస్తుంది. ఈ ఏడాది కాలంలో అత‌గాడిలో వ‌చ్చిన మార్పులు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అప్ప‌ట్లో విలాస‌జీవితానికి కేరాఫ్ అడ్ర‌స్ గా మారి.. అత‌గాడు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.

ఏడాది జైలు జీవితంలో అత‌డి బ‌రువు ఏకంగా 13 కేజీలు త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. జైలుకు వెళ్లే స‌మ‌యంలో 105 కేజీలు ఉన్న అత‌డు.. ప్ర‌స్తుతం 92 కేజీల‌కు త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. ముఖం మీద మ‌డ‌త‌ల‌తో పాటు.. గ‌డ్డం నెరిసిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

ముఖం క‌ళ కూడా త‌గ్గింద‌ని.. సాధార‌ణ ఖైదీల మాదిరే అత‌డు జైల్లో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని చెబుతున్నారు. బాబాకు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అత‌డికి కూర‌గాయ‌లు పండించే ప‌ని అప్ప‌జెప్పిన జైలుసిబ్బంది చెప్పిన‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఉద‌యం వాకింగ్ తో పాటు.. యోగా చేస్తుంటార‌ని.. బ్యాడ్మింట‌న్ కూడా ఆడుతుంటార‌న్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత మున్షీ ప్రేమ్ చంద్ ర‌చ‌న‌ల్ని చ‌దువుతుంటాడ‌ని.. ప్ర‌తి రోజూ కూర‌గాయ‌లు పండించ‌టంతో అత‌డికి రోజు కూలీ కింద రూ.200 అంద‌జేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అత‌డి భ‌ద్ర‌త దృష్ట్యా అత‌గాడు బ్యార‌క్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో మాత్రం మిగిలిన ఖైదీల్ని బ్యార‌క్ ల‌కే ప‌రిమితం చేస్తార‌ట‌. ఏడాది జైలు జీవితానికే బాబా బ‌రువు ఇంత‌లా త‌గ్గిపోతే.. రానున్న రోజుల్లో మ‌రెంత‌లా మార‌తారో?