Begin typing your search above and press return to search.
చెల్లెల్ని చంపినందుకు గర్వపడుతున్నాడట
By: Tupaki Desk | 18 July 2016 2:16 PM GMTఅందరూ అనుకుంటున్నదే నిజమని తేలింది. పాకిస్థాన్ వివాదాస్పద మోడల్ కందీల్ బలోచ్ ది పరువు హత్యే అని స్పష్టమైంది. తన చెల్లెల్ని తానే హత్య చేశానని ఒప్పుకున్న కందీల్ సోదరుడు మహ్మద్ వసిమ్.. ఆమెను చంపినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం. శనివారం వసీమ్ ను అరెస్టు చేసిన పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే కందీల్ ను హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఆమెను హత్య చేసినందుకు గర్వంగా ఉందన్న అతను.. తాను చేసిన పనికి భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని చెప్పాడు.
తాను మాదక ద్రవ్యాలకు బానిసైన మాట వాస్తవమే అని.. ఐతే కందీల్ ను హత్య చేయడానికి అది ఎంత మాత్రం కారణం కాదని.. తాను పూర్తి స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. కందీల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు పెడుతూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే ఆమె హత్య చేశానన్నాడు. అమ్మాయిలు పుట్టేది ఇంట్లో ఉండేందుకని.. వాళ్లు సంప్రదాయాలు పాటించాలని.. కానీ తన చెల్లెలు అలా ఎప్పుడూ లేదని అతనన్నాడు. మోడల్ గా మారాక కుటుంబానికి దూరంగా ఉంటున్న కందీల్.. ఇటీవలే రంజాన్ పండగ కోసం ఇంటికి వెళ్లగా.. సోదరుడితో గొడవ జరగడం.. అతను ఆమెను గొంతు నులిమి చంపేయడం తెలిసిన సంగతే.