Begin typing your search above and press return to search.
సన్ని పాల్గొనే ప్రోగ్రాంకు ఆ దేశంలో అనుమతి నో
By: Tupaki Desk | 6 March 2016 9:37 AM GMTగత చరిత్ర ఏమిటన్న విషయాన్ని పక్కన పెడితే.. సన్నిలియాన్ కు దేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి పోర్న్ స్టార్.. ప్రస్తుత బాలీవుడ్ నటి అయిన సన్నిలియాన్ సినిమాలోనే కాదు.. తన పేరుతోనూ సన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె పాల్గొనే కార్యక్రమం అంటే చాలు అదో పెద్ద ప్రోగ్రాంగా మారటమే కాదు..జనాలు విరగబడి రావటం ఈ మధ్యన ఎక్కువైంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఖతార్ లో ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
బాలీవుడ్ నైట్ షో పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సన్నిలియాన్ ప్రత్యేక ఆకర్షణగా ప్రచారం చేశారు. దీనికి ముందే ఆ దేశ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ నెల 11న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన నిర్వాహకులు అందుకు తగ్గట్లే షో టిక్కెట్లను అమ్మేశారు. సన్నికి ఉన్న క్రేజ్ తో ఆ దేశంలో పిచ్చ పిచ్చగా జనాలు ఈ షో టిక్కెట్లు కొనేశారు.
ఇక.. అనుకున్న తేదీ ఎప్పుడు వస్తుందా? అని ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్న వారికి షాకిస్తూ అక్కడి అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సన్నిలాంటి వ్యక్తి పాల్గొనే కార్యక్రమాలకు తాము అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు తేల్చేశారట. దీంతో.. దిక్కుతోచని నిర్వాహకులు.. ప్రభుత్వంతో పెట్టుకోలేక.. వారి ఆదేశాలకు తగ్గట్లే షోను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. సన్ని పేరు మగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించటం కామనే. కానీ.. ఏకంగా విదేశీ ప్రభుత్వాల్లోనూ కలకలం రేపే సత్తా సన్ని సొంతమన్నట్లుగా మారింది తాజా ఉదంతాన్ని చూసినప్పుడు.