Begin typing your search above and press return to search.

2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఎక్కడంటే.?

By:  Tupaki Desk   |   16 July 2018 8:45 AM GMT
2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఎక్కడంటే.?
X
ఫుట్ బాల్ మేనియా నిన్నటితో ముగిసిపోయింది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రోయేషియా పై ఘనవిజయం సాధించింది. దీంతో ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. మరి 2022 ప్రపంచకప్ టోర్నీ ఎక్కడ అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుట్ బాల్ 2022 ప్రపంచకప్ టోర్నీ ఖతార్ లో నిర్వహిస్తున్నట్టు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటినో తెలిపారు. క్రెమ్లిన్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ - ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ కి 2022 ప్రపంచకప్ టార్చ్ ను అందించారు.

ఖతార్ చాలా చిన్న గల్ఫ్ దేశం.. దాని విస్తీర్ణం చాలా తక్కువ. కేవలం ఒక చోటు నుంచి 180కి.మీల వెళితే ముసిగిపోతుంది. దేశ జనాభా 2.5 మిలియన్లు. సాధారణంగా ప్రపంచకప్ మే, జూన్ లేదా, జూలై నెలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గల్ఫ్ దేశాల్లో ఈ సమయంలో ఎండలు మండిపోతాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతాయి. మధ్యాహ్నం పూట కార్మికులకు సెలవులు ఇస్తారు. దీంతో ఆ నెలలలో ప్రపంచకప్ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండకపోవడంతో షెడ్యూల్ ని మొదటి సారిగా మార్చారు. నవంబర్ 21, 2022న టోర్నీ ప్రారంభమవుతున్నట్లు ఫిఫా నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ లో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఖతర్ లో నమోదవుతాయి. అప్పుడు చలికాలం అనువుగా ఉంటుంది. ఫైనల్ డిసెంబర్ 18న ఉండే అవకాశం ఉంది.

ఖతర్ దేశం వచ్చే ప్రపంచకప్ ఆతిథ్యం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఈ టోర్నమెంట్ కోసం ఎనిమిది నూతన స్టేడియాలను నిర్మిస్తోంది. ప్రతి స్టేడియం ఖతర్ రాజధాని దోహా నుంచి 35కి.మీల దూరంలో ఉండేలా స్టేడియాలను నిర్మించారు. వచ్చే 2022 ప్రపంచకప్ లో జట్లసంఖ్యను 32 నుంచి 48కి పెంచడానికి యోచిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.