Begin typing your search above and press return to search.

కతార్ వరల్డ్ కప్.. వలస కార్మికుల మృతికి బాధ్యులెవరు..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 2:30 AM GMT
కతార్ వరల్డ్ కప్.. వలస కార్మికుల మృతికి బాధ్యులెవరు..!
X
ఫిపా ప్రపంచ కప్-2022 పోటీలు కతార్ వేదికగా జరుగనున్నాయి. నవంబర్ 20న ప్రారంభమయ్యే అంతర్జాతీయ పురుషుల ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు డిసెంబర్ 18 వరకు జరుగనున్నాయి. 32 టీములు ఐదు గ్రూపులుగా ఫిపా ప్రపంచ కప్ కోసం పోటీ పడనున్నాయి. కతార్ లోని ఎనిమిది స్టేడియాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు ఆ దేశం ఇప్పటికే పనులను పూర్తి చేసింది.

అయితే ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల కోసం కతార్ తన మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చివేసింది. ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌ నిర్వహణ కోసం చేపట్టిన పనుల కోసం దక్షిణాసియాకు చెందిన 50 లక్షల మందిని జనాన్ని ఖతార్ పనుల్లో పెట్టుకుంది. వీరిలో నేపాల్ పౌరులు కూడా ఉన్నారు.

ఈ పనుల్లో భాగంగా నేపాల్ కు చెందిన ఉమేష్ యాదవ్ అనే 32 ఏళ్ల వ్యక్తి భద్రతా వైఫల్యాల కారణంగా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నవంబర్ 10 తెల్లవారుజామున కతార్ నుంచి ఉమేష్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో నేపాల్ కు తరలించారు. అక్కడ ఉమేష్ తల్లిదండ్రులకు అతడి శవాన్ని అప్పగించారు.

ఉమేష్ మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు నాలుగేళ్ల కింద ఖతార్ కు వెళ్లాడని చెబుతున్నారు. ఉమేష్ ను కతార్ పంపేందుకు తన వద్ద ఉన్న కొన్ని బర్రెలు అమ్మి 1500 డాలర్లో ఖతార్ కు పంపించినట్లు తెలిపారు. తన కుమారుడు పని చేస్తున్న చోటు నుంచి కొన్నిసార్లు తన సెల్ఫీలు పంపించేవాడని తెలిపారు.

గత నెల అక్టోబర్ 12 నుంచి సెలవులపై ఉమేష్ ఇంటికి రావాల్సి ఉందని ఉమేష్ తల్లిదండ్రులు వాపోయారు. కానీ ఇంతలోనే తమ కుమారుడి శవాన్ని ఖతర్ ప్రభుత్వం తమకు అప్పగించిందని వాపోయారు. కతార్ నిర్మాణ పనుల్లో భద్రతా చర్యల నిర్లక్ష్యం కారణంగానే ఉమేష్ మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ సంఘటన తరహాలోనే నేపాల్ చెందిన సీతేష్ అనే వ్యక్తి ఇటీవల కతార్ రాజధాని దోహా నగరంలో నేలకు ఏడు అడుగుల లోతున ఉమేష్ పని చేస్తుండగా అతడిపై బరువైన మట్టిపెళ్లలు పడ్డాయని మరణ ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారని ఆయన కుమారుడు తెలిపారు. తన తండ్రిని పనిలో పెట్టుకున్న వ్యక్తి లేదంటే సంస్థ తమకు నష్టపరిహారం ఇస్తామని ఇప్పటివరకు చెప్పలేదని వాపోయాడు.

కతార్‌లో ప్రపంచ కప్ నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచీ దాదాపు 12 మంది వరకు ఇప్పటికే మృతి చెందారని తెలుస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు వలస కార్మికులు చెబుతున్నారు. అయితే తమను ఉద్యోగాల నుంచి సంస్థలు తొలగిస్తారనే భయంతో ఎవరూ కూడా ఫిర్యాదు చేయడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.