Begin typing your search above and press return to search.
మరో మిస్సైల్ పరీక్ష విజయవంతం
By: Tupaki Desk | 14 Nov 2020 12:50 PM GMTభారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో భారీ ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణులను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
అన్నిరకాల వాతావరణాల్లో పనిచేస్తే ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ -ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
ఒడిషాలోని చందీపూర్ లోగల ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ అధునాతన క్షిపణులను పరీక్షించారు. గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా పేల్చింది.
యుద్ధరంగంలో శత్రు విమానాలను కూల్చగల ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. దీని స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానికదళం పరీక్షించనుంది. ఆ తర్వాత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు చేస్తారు.
పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.