Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. క్వారంటైన్​ మూడురోజులే.. టీమిండియాకు భారీ ఊరట..!

By:  Tupaki Desk   |   22 May 2021 11:30 PM GMT
హమ్మయ్య.. క్వారంటైన్​ మూడురోజులే.. టీమిండియాకు భారీ ఊరట..!
X
ఇంగ్లాండ్​ పర్యటనకు వెళుతున్న భారత ఆటగాళ్లకు భారీ ఊరట దక్కింది. క్వారంటైన్​ సమయాన్ని 10 రోజుల నుంచి మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డు ఒప్పుకున్నది. భారత పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్​ కు వెళ్తున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​ షిప్​ ఫైనల్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్​ కు బయలుదేరనున్నది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు.. వాళ్ల కుటుంబసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకొని.. క్వారంటైన్​ లో ఉన్నారు.

అయితే వీళ్లకు బ్రిటన్​ క్రికెట్​ బోర్డు సైతం క్వారంటైన్​ విధించింది. ఇండియా నుంచి వచ్చాక కచ్చితంగా 10 రోజలు కఠిన క్వారంటైన్​ లో ఉండాలని సూచించింది. దీంతో ప్రాక్టీస్​ ఇబ్బంది అవుతుందని క్రీడాకారులు భావిస్తున్నారు. అంతేకాక ఇప్పటికే ఈ విషయంపై పలు మార్లు బీసీసీఐ సైతం ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డుతో మాట్లాడింది. దీంతో స్పందించిన ఇంగ్లండ్​ బోర్డు 10 రోజుల క్వారంటైన్​ ను మూడు రోజులకు కుదించింది. టీమిండియా క్రికెటర్లకు ఇది శుభవార్త అని బీసీసీఐ అంటున్నది. క్రికెటర్లకు ప్రాక్టీస్​ చేసుకొనేందుకు అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌ టూర్‌ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్‌ 2న ఇంగ్లాండ్‌ కు వెళ్లనున్నాయి. అయితే ఈ పర్యట కోసం ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు తొలుత కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో బీసీసీఐ .. ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. క్వారంటైన్​ నిబంధనలు సడలించాలని.. కేవలం మూడు రోజుల పాటే క్వారంటైన్​ ఉండాలే చూడాలని కోరింది. దీనికి స్పందించిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్‌ విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.