Begin typing your search above and press return to search.

రూపాయికే క్వార్టర్ మద్యం ... పరుగులు తీసిన మందుబాబులు , కానీ !

By:  Tupaki Desk   |   16 Nov 2020 1:30 PM GMT
రూపాయికే క్వార్టర్ మద్యం ... పరుగులు తీసిన మందుబాబులు , కానీ !
X
మద్యం .. మందుబాబులకి ఈ పేరు వినగానే నాలుక మీద నీళ్లు ఊరుతుంటాయి. మొన్న ఆ మధ్య లాక్ డౌన్ లో ఎక్కువమంది ఇబ్బంది పడింది కూడా మద్యం దొరకకే. అదేందో కానీ మద్యం పేరు చెప్తే ఎగబడి వెళ్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో అయితే ఫ్రీ గా క్వార్టర్ బాటిల్ ఇస్తే సాయంత్రం వరకు వారితో పాటుగా తిరుగుతుంటారు. ఇదిలా ఉంటే ... అసలు మద్యం దొరకలేదు అని భాదపడుతున్న సమయంలో రూపాయికే క్వార్టర్ అంటూ ఓ వైన్ షాప్ ఓనర్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీనితో ఇంకేముంది షాప్ ముందు క్యూ కట్టారు. అసలు రూపాయి కి క్వార్టర్ ఎలా ఇస్తారు అనుకుంటున్నారా ? దీని వెనుక ఓ ట్విస్ట్ ఉంది.

అదేమిటి అంటే ... ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎన్ శంకర్ పై ఉన్న అభిమానంతో శంకర్ పెళ్లి రోజు సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తన అభిమానాన్ని చాలా కొత్తగా చాటుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ లో ఉన్న ఎస్వీ వైన్ షాప్ లో శంకర్ పెళ్లి రోజు సందర్భంగా , ఒక గంట సమయం పాటు మద్యం క్వార్టర్ ను కేవలం ఒక్క రూపాయికే అందించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి , నిముషాల్లోనే చుట్టుపక్కల ఉన్న మందుబాబులకు తెలియడంతో షాప్ దగ్గర భారీగా మందుబాబులు గుమ్మిగూడారు. దీనితో రద్దీని తట్టుకోలేక , క్యూలో నిలబడ్డవారికి టోకెన్లు అందించారు. అయితే, కేవలం 45 మంది మాత్రమే ఈ అఫర్ ను అందుకొని రూపాయికే క్వార్టర్ తీసుకోని తాగేశారు. ఏదేమైనా డైరెక్టర్ పై పిచ్చి అభిమానం తో చేసిన ఈ పని ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకి దారితీస్తుంది.