Begin typing your search above and press return to search.

క్వీన్ మరణం.. జాతీయ జెండా.. కరెన్సీ.. స్టాంపులు.. అన్నీ మారిపోతాయట

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:37 PM GMT
క్వీన్ మరణం.. జాతీయ జెండా.. కరెన్సీ.. స్టాంపులు.. అన్నీ మారిపోతాయట
X
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి అంటూ మనం చరిత్రలో చదువుకునే పాఠాలు. కానీ.. ప్రపంచంలో చాలానే రాజరికాలు ఇప్పటికి ఉన్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు.. ప్రపంచంలో సంపన్న దేశాల్లో ఒకటైన గ్రేట్ బ్రిటన్ లో.. రాజరిక ప్రజాస్వామ్యమన్న సంగతి తెలిసిందే. మనకు రాష్ట్రపతి మాదిరే బ్రిటన్ కు రాణి (ఇప్పటివరకు) లేదంటే రాజు ఉంటారు. మన రాష్ట్రపతి కంటే కాసిన్ని ఎక్కువ అధికారాలు బ్రిటన్ ను పాటించే రాజు/రాణికి ఉంటాయి. 70 ఏళ్ల పాటు బ్రిటన్ కు రాణిగా వ్యవహరించిన క్వీన్ ఎలిజిబెత్ 2 నిన్న (గురువారం) మరణించిన నేపథ్యంలో దేశంలో ఇప్పుడు బోలెడన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

బ్రిటన్ రాజుగా క్వీన్ ఎలిజిబెత్ కుమారుడు చార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎలిజిబెత్ మరణంతో ఆ దేశంలో బోలెడన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ దేశంలో కొత్త రాజు పాలనా పగ్గాలు చేపట్టిన వేళలో.. సమూల మార్పులు జరుగుతాయి. 70 ఏళ్లుగా క్వీన్ ఎలిజిబెత్ ఏలుబడిలో ఉండటంతో ఇలాంటి మార్పులు చోటు చేసుకొని చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు మారే వాటిలో శాంపిల్ గా చెప్పాల్సి వస్తే..

- జాతీయ గీతం
- కరెన్సీ
- స్టాంపులు
- పాస్ పోర్టులు
- పోస్టు బాక్సులు ఇలాంటివెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజు మారినప్పుడు ఇలా మార్చటం అన్నది ఆ దేశంలో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇదే తీరును క్వీన్ ఎలిజిబెత్ 2 మరణంతోనూ జరగనుంది. 11 శతాబ్దాలుగా బ్రిటన్ లోని రాయల్ మింట్ కరెన్సీని విడుదల చేస్తూ వస్తోంది. చక్రవర్తి ముఖ చిత్రాలతో నాణేలు.. కరెన్సీనోట్లను ముద్రిస్తారు. 1952లో రాణిగా ఎలిజిబెత్‌ 2 పట్టాభిషేకం తర్వాత బ్రిటన్‌.. కామన్వెల్త్‌ దేశాల్లో ఆమె ముఖ చిత్రంతో తయారు చేసిన నాణేలు.. కరెన్సీ నోట్లను విడదుల చేశారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆమె గౌరవార్థం కొత్త నాణేల్ని రూపొందించేవారు.

ఇప్పుడు బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 సింహాసాన్ని అధిష్ఠించనుండటంతో కరెన్సీలో మార్పులు జరగనున్నాయి. కరెన్సీ నోట్ల మీదా.. నాణెల మీదా చార్లెస్ ఫోటోను ప్రింట్ చేయనున్నారు. యూకే కరెన్సీ పౌండ్ మీద రాణి ఎలిజిబెత్ 2 చిత్రం కుడివైపున.. చార్లెస్ 3 ముఖచిత్రం ఎడుమ వైపు ఉండనుంది. కరెన్సీ నోట్ల మీద రాణి లేదంటే రాజు ముఖచిత్రంతో పాటు అంతకు ముందు పాలించిన వారి ముఖచిత్రానికి అభిముఖంగా ఉంచడటం 300 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని ఫాలో కానున్నారు.

ఇదిలా ఉంటే.. దశాబ్దాలుగా తమకు మహరాణిగా ఉన్న క్వీన్ ఎలిజిబెత్ 2 మరణంతో బ్రిటన్ ప్రజలంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె వారసుడిగా ప్రిన్స్ చార్లెస్ 3 బాధ్యతలు చేపడతారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి కొత్త రాజు తన తొలి ప్రసంగాన్ని చేయనున్నారు.అయితే.. ఇది ముందుగా రికార్డు చేసి విడుదల చేస్తారు.

రాజు హోదాలో తొలుత బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తో సమావేశం అవుతారని చెబుతున్నారు. క్వీన్ మరణానికి రెండు రోజుల ముందే ఆమెను నియమించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచినట్లుగా ప్రకటన విడుదల చేసి.. ఆమెను ప్రధానిగా నియమించారు. సుదీర్ఘంగా సాగే క్వీన్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. రాజ కుటుంబం సంతాప కాల వ్యవధిని నిర్ణయిస్తారు.

సాధారణంగా ఈ సంతాపకాలం నెల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే యూకేలోని లిజ్ ప్రభుత్వం 10 రోజుల పాటు సంతాప దినాల్ని ప్రకటించారు. చివరి రోజున క్వీన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక.. క్వీన్ దేశాన్ని పాలించిన 70 ఏళ్లకు గుర్తుగా ఏడాదికి ఒక రౌండ్ చొప్పున మొత్తం 70 రౌండ్లను సెంట్రల్ లండన్ లోని పురాతన రాజకోట లండన్ టవర్ నుంచి కాల్పులు జరిపి ఆమెకు గౌరవ వందనాన్ని సమర్పిస్తారు. క్వీన్ మరణం నేపథ్యంలో

- వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే
- సెయింట్ పాల్స్ కేథడ్రల్
- విండ్సర్ కాజిల్‌ తో పాటు ఇతర ప్రదేశాల్లోని మఫిల్డ్ చర్చి గంటలు మోగించనున్నారు. ప్రధాని ట్రస్.. ఇతర సీనియర్ మంత్రులు సెయింట్ పాల్స్ ప్రరజా సంస్మరణ సభకు హాజరుకానున్నారు. యూకే పార్లమెంటు 2 రోజుల పాటు ప్రత్యేకంగా నివాళులు అర్పించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.