Begin typing your search above and press return to search.
ఒబామాకే చుక్కలు చూపించిన లేడీ
By: Tupaki Desk | 27 April 2016 8:26 AM GMTఅమెరికా అధ్యక్షుడి పర్యటన అంటే సెక్యూరిటీ హంగామా అంతా ఇంతా కాదు… అధ్యక్షుడు పర్యటనకు ముందే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతుంటారు. కానీ బ్రిటన్ పర్యటనలో ఒబామాకు అంత సెక్యూరిటీ అవసరం లేదని బ్రిటన్ రాణి ఎలిజబెత్ తేల్చి చెప్పారట.
ఒబామా బ్రిటన్ పర్యటనలో సీక్రెట్ సర్వీస్ కు చెందిన చాపర్లు మూడింటికి మాత్రమే తమ గడ్డపై ల్యాండింగ్ కు అనుమతిస్తామని బ్రిటన్ రాణి ఎలిజబెత్ స్పష్టం చేశారు. ఆమె నివాసానికి ఒబామా హెలికాప్టర్ లో రానుండగా, 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంగణంలోకి మూడు హెలికాప్టర్లను మాత్రమే అనుమతించాలని ఆమె నిర్ణయించినట్టు ‘డైలీ ఎక్స్ ప్రెస్’ వెల్లడించింది.
రెగ్యులర్ గా ఒబామాకు సెక్యూరిటీగా ఆరు చాపర్లు ఉంటాయి. వాటన్నింటినీ రాజ భవంతి విండ్ సార్ క్యాజిల్ లోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. 2011లో ఒబామా బ్రిటన్ పర్యటించిన సమయంలో…ఆరు హెలికాప్టర్లకు అనుమతించారు… ఆ భవంతిలోని పూల మొక్కలు - గడ్డి నాశనమైనాయని రాణి గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. అందుకే ముందస్తుగా మూడు హెలికాప్టర్లకే అనుమతించాలని నిర్ణయించారట.