Begin typing your search above and press return to search.
క్యూ కష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ్
By: Tupaki Desk | 1 Dec 2016 7:09 AM GMTపెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని మూడు వారాలైపోయింది. కానీ.. బ్యాంకుల వద్దా.. ఏటీఎం సెంటర్ల వద్దా క్యూ కష్టాలు మాత్రం తీరని పరిస్థితి. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. నెల మొదటి రోజు కావటంతో జీతాల డబ్బులు బ్యాంకుల్లో పడుతున్న నేపథ్యంలో.. నెలసరి అవసరాల కోసం డబ్బుల్ని డ్రా చేసేందుకు ప్రజలు బ్యాంకుల వద్దకు పోటెత్తుతున్నారు. గత నెల 8న ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి.. నెల మొదలైవారం దాటి పోవటంతో చాలామంది ప్రజలు.. ఆ నెలకుఇవ్వాల్సిన బకాయిల్ని ఇచ్చేయటంతో పాటు.. చాలావరకూ చెల్లింపుల్నిజరిపేశారు. దీంతో..వారిపై ఉన్న ఒత్తిడి కొంత తక్కువగా ఉన్న పరిస్థితి.
కానీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. గడిచిన మూడు వారాలకు పైనే.. క్యూ కష్టాలు తగ్గుతాయన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సర్దుకుంటున్న కొంతమంది ఏటీఎం సెంటర్ల వద్దా.. బ్యాంకుల వద్దకు రాకుండా ఆన్ లైన్లోనే పని పూర్తి చేసుకుంటున్నారు. అయితే.. నెల మొదట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ అయిన నేపథ్యంలో.. రోజువారీ అవసరాల కోసం డబ్బులు తీసుకోవటం తప్పనిసరి అవుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏటీఎంలు.. బ్యాంకుల్లో క్యాష్ బాగానే ఉందన్న అభిప్రాయం ఉంటే బాగుండేది. కానీ.. బ్యాంకుల్లో క్యాష్ లేదని.. వారానికి రూ.24వేల విత్ డ్రా పరిమితి ఉన్నప్పటికీ.. అంత మొత్తాన్ని బ్యాంకులు ఇవ్వని నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరిగిపోవటమే కాదు.. అవసరానికి మించిన మొత్తాన్ని చేతిలో ఉంచుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీంతో.. కరెన్సీ నోట్ల అవసరం మరింత పెరుగుతోంది. క్యూ కష్టాల్ని తలుచొని.. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకునే కన్నా.. వీలైనంత వరకూ చేతిలో క్యాష్ ఉంచుకోవటానికి ఎక్కువ మంది భావిస్తున్న వేళ.. క్యూ కష్టం అంతకంతకూ పెరిగిపోతోంది. దినకి తోడు.. రోజువారీగా క్యూలలో నిలుచునేవారికి.. ఫస్ట్ తారీఖు అవసరాలకు బ్యాంకులకు.. ఏటీఎంల వద్దకు పోటెత్తుతున్న వారితో సమస్య తీవ్రత మరింత పెరిగిపోతోంది. ఏది ఏమైనా.. నెల మొదటి రోజున జీతం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో భద్రంగా ఉన్నప్పటికీ..చేతికి రాని వైనం ప్రజల్లో చిరాకు పుట్టిస్తుందనటంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించటానికి వీలుగా ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/