Begin typing your search above and press return to search.
ఏటీఎం క్యూ బారులు మాయం కావాలంటే..
By: Tupaki Desk | 6 Dec 2016 3:01 AM GMTమహా అయితే వారం కష్టపడితే చాలు.. మొత్తంగా సెట్ అయిపోతుందని అనుకున్నారంతా. మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చోటు చేసుకున్న నోట్ల కొరత కారణంగా బ్యాంకులు.. ఏటీఎం సెంటర్లలో భారీ క్యూలు నెలకొన్న పరిస్థితి. మరో రెండు రోజులు గడిస్తే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి నెల దిగ్విజయంగా పూర్తి కానుంది. అయినప్పటికీ ఏటీఎంల ముందు క్యూ బారులు తగ్గని దుస్థితి.
కరెన్సీ నోట్ల కొరత లేదని కేంద్రం.. రిజర్వ్ బ్యాంకు పదే పదే చెబుతున్నా.. విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళుతున్న వారందరికి కరెన్సీ నోట్ల కొరత ఏ స్థాయిలో ఉందన్నది ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. వారానికి రూ.24వేలు విత్ డ్రా చేసుకునే వీలున్నా.. అలాంటిది సాధ్యం కాదని.. క్యాష్ కొరత కారణంగా రోజుకు రూ.2 వేల నుంచి రూ.4వేలవరకూ మాత్రమే ఇవ్వగలమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ.. రోజూ రూ.4వేల చొప్పున బ్యాంకుల దగ్గర విత్ డ్రా చేసేందుకు వెళితే.. వారం మొత్తం కలిపితే కానీ చేతికి రూ.24వేలు అందని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఇంకెంతకాలం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నోట్ల రద్దు నేపథ్యంలో.. నోట్ల కొరత మామూలే అయినప్పటికీ.. రోజులు గడుస్తున్నా.. నోట్ల కొరత మాత్రం ఎంతకూ తీరని పరిస్థితి.
ఈ నేపథ్యంలో నోట్ల కొరత తగ్గి.. ఎప్పటిలానే ఏటీఎంలు..బ్యాంకుల వద్ద జనం జాడే కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎన్ని నోట్లు కావాలన్న ప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు. దీనికి సమాధానం వెతికితే.. ఆసక్తికర కోణం ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడున్న క్యూలు మటుమాయం కావాలంటే.. కనీసం రూ.10లక్షల కోట్లకు చెందిన నోట్లు సర్క్యులేషన్ లోకి వస్తే తప్పించి.. నోట్ల సమస్య తీరదన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న చలామణిలో ఉన్న రూ.2వేలు.. రూ.100 నోట్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదని.. రూ.500నోట్లు భారీగా జనసామ్యంలోకి తీసుకొస్తే తప్పించి.. నోట్ల కొరత తీరే అవకాశం ఎంతమాత్రం లేదన్న మాట వినిపిస్తోంది. లక్షల కోట్ల రూపాయిల విలువున్న రూ.500నోట్లు ఇప్పుడు చెలామణిలో లేని వేళ.. క్యూ బారులు ఇప్పట్లో తీరేలా లేవన్నఅభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు సైతం.. ఈ వాదనను అంగీకరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 49వేల ఏటీఎం సెంటర్లకు.. 43 వేల ఏటీఎం సెంటర్లను కొత్త నోట్లకు తగ్గట్లు మార్పులు చేశారు. మార్పులతో కొరత తీరదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మార్చిన సెంటర్లలో ప్రజలు కోరినంత డబ్బులు వస్తున్నప్పుడు మాత్రమే ఈ క్యూ బారులు కనిపించకుండా పోతాయని చెప్పకతప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిది సాధ్యం కాదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/