Begin typing your search above and press return to search.
వామ్మో.. ఈ మాటలేంది కృష్ణయ్య
By: Tupaki Desk | 13 Jan 2016 5:24 AM GMTవెనుకబడిన వర్గాల ఉద్యమవేత్తగా సుపరిచితుడైన ఆర్ కృష్ణయ్య మాటలతో చెలరేగిపోయారు. తనెంత ఫైర్ బ్రాండ్ అన్న విషయాన్ని తాజాగా స్పష్టం చేసే యత్నంలో ఆయన.. మాట తూలటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మాటలు తూటాలు పేలుస్తున్న నేతలకు తానేమీ తీసిపోనని.. ఆ మాటకు వస్తే.. వారి కంటే తాను నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని.. దొంగ కేసులు బనాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అలా చేస్తే తనకు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు బాగానే సాగిన కృష్ణయ్య మాటలు ఇక్కడే అదుపు తప్పాయి. తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెయ్యి మందిని పంపిస్తానని.. టీఆర్ ఎస్ నేతల్ని.. పోలీసుల్ని బట్టలూడదీసి కొట్టిస్తానంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
ఎన్నికల సమయంలో నేతల మాటలు ఘాటుగా ఉండటం మామూలే కానీ.. మరీ ఇంత మసాలా అవసరమా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల మధ్యనున్న లొల్లితో మాటలు అనుకోవటం బాగానే ఉన్నా.. మధ్యలో శాంతిభద్రతలు కాపాడే పోలీసుల మీద పడటం అంత సబబుగా లేదన్న మాట వ్యక్తమవుతోంది. మరి.. దీని భావం ఉద్యమనాయకుడు కృష్ణయ్యకు అర్థమవుతుందా?