Begin typing your search above and press return to search.

సీఎం అభ్యర్థికి రూట్ నాట్ క్లియర్

By:  Tupaki Desk   |   23 Oct 2018 10:30 AM GMT
సీఎం అభ్యర్థికి రూట్ నాట్ క్లియర్
X
బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత ఆర్ కృష్ణయ్య. గత ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థి. ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో లేరు. ఇప్పుడు మరో పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అయినా, ఆయన ఏ పార్టీకి జైకొట్టాలో తెలియక జంక్షన్ లో ఉండిపోయారు. ఎటువైపు వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందో తెల్చుకోలేకపోతున్నారు.

విభజన జరిగాక 2014 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేతను చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, ఆర్ కృష్ణయ్యను ప్రకటించారు. కానీ, టీడీపీ అంతలా పుంజుకోలేదు. ఆయన సీఎం కాలేదు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కృష్ణయ్య టీడీపీకి బై బై చెప్పేశారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు ఊపందుకున్న వేళ ఆయనను సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది.

సీపీఎం బీఎల్ ఎఫ్ తరుపున సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యగా ప్రకటించారు. కృష్ణయ్య మాత్రం ఏ అభిప్రాయమూ వ్యక్తం చేయలేదు. ఒకానొక దశలో మంద కృష్ణ మాదిగ - కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళిక కూడా రచించారట. సొంత పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అవి ఏమి వర్కవుట్ అవలేదు. దాంతో ఆయన పొలిటికల్ భవిష్యత్తు ఏదో ఒక పార్టీతో నిర్ణయించుకోక తప్పడం లేదు.

ప్రస్తుతం ఆయన చూపు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన గత ఎన్నికల్లో ఎల్ బీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజా మాజీ ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ తరుపున బరిలో దిగాలన్న కుదిరేలా లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున సుధీర్ రెడ్డి అక్కడ ప్రచారం మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో కృష్ణయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. దాదాపు ఆయన కాంగ్రెస్ తోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.