Begin typing your search above and press return to search.
సాగర్ లో భగత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం : ఆర్.కృష్ణయ్య !
By: Tupaki Desk | 2 April 2021 3:30 PM GMTప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు రాగా, నోముల నర్సింహయ్య కుమారుడు భరత్ ను బరిలోకి దింపింది టీఆర్ ఎస్ ఇక, సీనియర్ నేత జానారెడ్డి, మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, సాగర్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసింది. అటు అన్ని పార్టీలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాయి.
అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో అనూహ్యంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య టీఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్ కాచిగూడలో గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ అభ్యర్థిని జనరల్ స్థానంలో గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు చెందిన బీసీ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని తాము చేసిన విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుని ఉద్యమాల వీరుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కు కేటాయించారని పేర్కొన్నారు. బీసీలంతా భగత్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి బీసీల కొత్త చరిత్రకు నాంది పలకాలని ఆయన కోరారు. 14 బీసీ సంఘాలు, 47 బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అన్ని బీసీ కులాలు, సంఘాల నాయకులు సమావేశమై చర్చించి బీసీ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్క బీసీ దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు