Begin typing your search above and press return to search.

బాబును తమ్ముడు అంత మాట అనేశాడే

By:  Tupaki Desk   |   22 Jun 2016 6:58 AM GMT
బాబును తమ్ముడు అంత మాట అనేశాడే
X
ప్రతిపక్ష నేతల నోటి నుంచి రావాల్సిన మాటలు తమ్ముడు నోటి రావటం కాస్తంత ఆశ్చర్యం కలిగించే విషయమే. బాబు వస్తే జాబు పక్కా అంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటేసింది. అయినా..జాబుల మాటేమిటంటే.. నోటి వెంట మాట రాని పరిస్థితి. జాబు రాకపోతే సరే.. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చెప్పిన మాటల సంగతేంటంటూ అడిగితే సమాధానం చెప్పే వారే కనిపించని దుస్థితి.

ఇదిలా ఉంటే.. విపక్షం సంగతి తర్వాత స్వపక్షానికి చెందిన తెలంగాణ తెలుగు తమ్ముడు ఆర్ కృష్ణయ్య తాజాగా చెలరేగిపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకూ జాబులు ఇచ్చింది లేదంటూ మండిపడుతున్నారు. పేరుకు తెలంగాణ నేత అయినప్పటికీ ఉద్యమ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి ప్రాతినిధ్యం వహేంచేందుకు తహతహలాడిపోతున్న కృష్ణయ్య.. తనకు టిక్కెట్టు ఇచ్చిన అధినేతను సైతం విమర్శించేందుకు వెనకాడటం లేదు.

ఏపీపీఎస్సీ ప్రకటించనున్న గ్రూపు 1 సర్వీసులో గ్రూపు 2 సర్వీసులను విలీనం చేయరాదంటూ నిరుద్యోగులు పబ్లిక్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తే.. దానికి కృష్ణయ్య మద్దతు పలకటమే కాదు.. తన బాస్ చంద్రబాబు మీద కూడా విరుచుకుపడేందుకు సైతం వెనుకాడటం లేదు. అంతే కాదు.. ఏపీ విపక్ష నేతలు విరుచుకుపడాల్సిన అంశాన్ని వారు వదిలేస్తే.. సొంత తమ్ముడే విరుచుకుపడటం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి.