Begin typing your search above and press return to search.
వాళ్లకు పదవులు,మాకు బర్రెలు, గొర్రెలా.?
By: Tupaki Desk | 22 Oct 2018 9:52 AM GMTబీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలంగాణ ఎన్నికల ముందుర తన మనోగతాన్ని ఆవిష్కరించారు. సోషల్ ఇంజనీరింగ్ తోనే బీసీలు ఎదుర్కొంటున్న వివక్ష పోతుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బుతోపాటు ఇప్పుడు కుల - జన బలం అవసరమని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటించే సీట్లలో ఎల్ బీ నగర్ నుంచి తన పేరును తీసేశారని.. అయినా తాను అక్కడి నుంచే స్వతంత్రంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కినప్పుడే బీసీలు అభివృద్ధి చెందుతారని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో టీఆర్ ఎస్ అన్యాయం చేసిందని.. కాంగ్రెస్ - బీజేపీలు కూడా తమ విధానాల్లో మార్పు చేసుకోకపోతే తగిన బుద్ది చెబుతామని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల ప్రకటన - టికెట్ల కేటాయింపు పూర్తయిన తర్వాతే ఏ పార్టీకి - కూటమికి మద్దతివ్వాలన్నది తాము నిర్ణయిస్తామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
తెలంగాణలో పొత్తులు మాత్రమే పెట్టుకుంటామని.. ఏపీలో పార్టీ పెట్టే కసరత్తు తీవ్రంగా చేస్తున్నామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఏపీలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని.. అక్కడ పార్టీ పెట్టి 175 సీట్లలో పోటీచేస్తామని స్పష్టం చేశారు. మన బీసీల ఓటు మనమే వేసుకుందామని.. పార్టీ పెట్టాలని చాలా మంది ఒత్తిడి తెస్తున్నట్టు తెలిపారు.
బర్రెలు - గొర్రెలకు డబ్బులుంటాయి కానీ బీసీ విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు డబ్బులు ఉండవా అని కేసీఆర్ తీరును ఆర్.కృష్ణయ్య ఎండగట్టారు. అధికార పార్టీ పిల్లలకు ఎంపీ - ఎమ్మెల్యే పదవులు కావాలని.. మా పిల్లలకు బర్రెలు - గొర్రెలు కాయాల్నా అని కేసీఆర్ ను నిలదీశారు.