Begin typing your search above and press return to search.
టీడీపీలోనే ఉన్నాను కానీ మహానాడుకు వెళ్లను!
By: Tupaki Desk | 26 May 2017 6:56 AM GMTబీసీ సంఘాల అధ్యక్షుడు, హైదరాబాద్ ఎల్ బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్న ఆర్ కే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానాడుకు హాజరుకాలేదు. అయితే మరుసటి రోజే విజయవాడకు వెళ్లి అక్కడే అమిత్ షా భేటీ అయ్యారు. అయితే అక్కడే ఉన్న సీఎం చంద్రబాబుతో సమావేశం కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడం, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని అయితే ఇందులో వాస్తవం లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. తను బీజేపీలో చేరుతున్నట్లు ఎక్కడా చెప్పలేదని, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంపై అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు. బీజేపీ ప్రభుత్వంపై బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆర్.కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో నామినేటెడ్ పద్ధతుల్లో బీసీలకు సీట్లు కేటాయించేలా చట్ట సవరణ చేయాలని అమిత్ షాను కోరారు. మహానాడుకు హాజరు అవకపోవడం గురించి వివరిస్తూ..గతంలో ఎన్నడూ తాను మహానాడుకు హాజరు కాలేదని ఆర్.కృష్ణయ్య తెలిపారు. త్వరలో జరగబోయే మహానాడుకు సైతం హాజరు కాను అని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ ముస్తాబైంది. మహానాడు జరగనున్న ప్రాంగణం జెండాలు, కటౌట్లు, పసుపు పందిళ్లతో కళకళలాడుతోంది. గురువారం నాటికే విశాఖ అంతా పసుపుమయం అయింది. సుమారు 25 వేల మంది కూర్చొనేందుకు వీలుగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిగిన అన్ని మహానాడుల కంటే ఇది అత్యంత భిన్నమైనదని టిడిపి ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు విశాఖ మూడంచెల భద్రతలోకి వెళ్లింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఆరుగురు ఎస్పీల స్థాయి అధికారులతో 3 వేల మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారిలో సుమారు 60 మందికి బందోబస్తును మరింత పటిష్టం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/