Begin typing your search above and press return to search.
కేసీఆర్ చరిత్ర సృష్టించారంటున్న టీడీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 14 March 2018 10:13 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై మరో ఎమ్మెల్యే ప్రశంసలు గుప్పించారు. అంతేకాకుండా ఆయన తనయుడు - యువ మంత్రి కేటీఆర్ కు కితాబు ఇచ్చారు. అయితే ఆయన గులాబీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు కాదు. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేసీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలంగాణ సాధించడం ఎంత గొప్ప చరిత్రనో.. తెలంగాణను అభివృద్ధి చేసి.. అంత కన్నా గొప్ప చరిత్రను సీఎం కేసీఆర్ సృష్టించాలన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
పారిశ్రామిక రంగంలో యువ మంత్రి కేటీఆర్ బాగా చొరవ చూపుతున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. పారిశ్రామిక రంగంలో మనకున్న వనరులను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎస్సీ - ఎస్టీ - బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. బీసీల కోసం సీఎం జరిపిన చర్చలు చరిత్రాత్మకం. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సీఎంను కృష్ణయ్య కోరారు.
కాగా, తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయిపోయిందనే తరుణంలో..ఆర్.కృష్ణయ్య కామెంట్లు కొత్త చర్చకు తెరలేపింది. గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలో టీడీపీలో ఉంది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే కాగా అందులో ఆర్.కృష్ణయ్య ఒకరు. ఆయన సైతం టీఆర్ ఎస్ పార్టీని కొనియాడటం గమనార్హం.