Begin typing your search above and press return to search.

కృష్ణ‌య్య‌కు అధ్యక్షుడి హోదా తొల‌గించేశారు

By:  Tupaki Desk   |   28 Dec 2017 7:47 AM GMT
కృష్ణ‌య్య‌కు అధ్యక్షుడి హోదా తొల‌గించేశారు
X
బీసీ సంఘాల‌కు నాయ‌క‌త్వం వ‌హించే తెలంగాణ రాష్ట్రంలోని ఎల్ బీ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్ కృష్ణ‌య్య‌ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి గౌర‌వ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే.. గౌర‌వాధ్య‌క్షుడిగా ఉండే వ్య‌క్తి ఏ రాజ‌కీయ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించ‌కుండా ఉండాలి. కానీ.. కృష్ణ‌య్య ఎల్ బీన‌గ‌ర్ టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగ‌టంతో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌టంతో ఆయ‌న్ను గౌర‌వాధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే సంద‌ర్భంగా కొత్త అధ్యక్షుడిగా ఏ రాజ‌కీయ పార్టీకి సంబంధం లేని వ్య‌క్తిని నియ‌మించాల‌ని డిసైడ్ చేశారు.

విశాఖ‌పట్నంలోని ఇంజ‌నీరింగ్ గెస్ట్ హౌస్ లో జ‌రిగిన రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో రాష్ట్ర అధ్య‌క్షుడు పోలాకి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త వహించారు. ఎమ్మెల్యే ప‌ద‌విని చేప‌ట్టి ఉండటం.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. ఏమైనా విభ‌జ‌న జ‌రిగి.. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడున్న‌రేళ్ల త‌ర్వాత వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.