Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు ఎమ్మెల్యే వార్నింగ్..భూములు ఇవ్వకపోతే గుడిసెలు వేసేస్తాం
By: Tupaki Desk | 16 April 2018 2:13 PM GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తూ ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న అర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ విధానాన్ని - కో ఆర్డినెన్స్ విధానాన్ని రద్దు చేయాలని సమావేశం నిర్వహించారు. సమావేశానికి శ్రీరెడ్డి - సినీ నటి అపూర్వ - ఓయూ జేఏసీ నాయకులు - పలు మహిళా సంఘాల నాయకులు సహా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 90శాతం తెలుగు వారికి అవకాశం కలిపించాలి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిన్న పవన్ పై చేసిన వ్యాఖ్యలను అర్టిస్టులు ఉపసంహరించుకున్నారు. ఆ చర్చలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి మాట్లాడుతూ...పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. పవన్ ప్యాకేజీలకు అమ్ముడుపోయారని, 200 కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ బెంగాళీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటారని కామెంట్స్ చేశారు. అయితే, శృతి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తాము ఉద్దేశ్య పూర్వకంగా అనలేదని వారు వివరణ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కొంతమంది అభిమానుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు.
ఆర్టిస్టుల సమావేశానికి హజరైన ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సినిమా చాలా ప్రభావితమై మాధ్యమమని పేర్కొన్నారు. తెర లోపల హీరోలుగా చేస్తూ తెర వెనుక వారు చేసే ఆగత్యాలు బయట పడ్డాయని అన్నారు. సినిమాలో అవినీతి - దోపిడీని అడ్డుకునే హీరోలు తెర వెనుక జరిగే దోపిడీ - అవినీతి ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. హీరోలకు - నిర్మాతలకు వందల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. హీరోలకు ఒక న్యాయం క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ సమస్యలపై చేసే ఉద్యమానికి తాను సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. హీరోకు శక్తి ఉండదని ఉట్టిగానే బయపడుతారని ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. కుక్కను చూస్తే భయపడుతారని వ్యాఖ్యానించారు. `రెండు కులాలు సినిమాను శాసిస్తున్నాయి. ఎవరి మొఖం అయినా సక్కగా ఉంటదా? హీరోల దగ్గర వంద ఎకరాలు ఉన్నాయి.. మర్యాదగా మీ జాగాలు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఇవ్వాలి లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో గుడిసెలు వేపిస్తాం` అంటూ ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. `తెలుగు వాళ్ళను సినిమాలలోకి తీసుకోవాలి. మంత్రి దృష్టికి మీ సమస్యను తీసుకువెళుతాను. సిని పరిశ్రమపై ఒక అధికారితో కమిటీ ఏర్పాటు చేయాలి. పన్నుల వసూలు కాదు ఆర్టిస్టుల బాధలు కూడా తెలుసుకోవాలి.` అని డిమాండ్ చేశారు.
సోనా రాథోడ్ అనే హిజ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ ` సినిమా రంగం దిగజారి పోయింది. వాకాడ అప్పారావు ఏదయినా రోగం వచ్చి మరణిస్తాడు. సమాజం నన్ను గుర్తించనప్పుడు నేను ఎందుకు వారికి విలువ ఇవ్వాలి? సినిమాలో నటించడం కన్నా ..నేను హిజ్రా గా చాలా బాధ పడుతున్నారు. ఆడదాన్ని మోసం చేసినట్టే.. మమ్ములను మోసం చేస్తున్నారు` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.