Begin typing your search above and press return to search.
సీఎం జగన్ 'మహానుభావుడు.. సెల్యూట్'.. ఎందుకంటే!
By: Tupaki Desk | 30 Dec 2022 2:30 PM GMT''ఆయన మహానుభావుడు.. సెల్యూట్'' ఈ మాట అన్నది ఎవరంటే.. ఎర్రజెండా సినిమాల దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి. మరి ఎవరి గురించంటే.. సీఎం జగన్ గురించే! తాజాగా అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది.
ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్‌ని కలిశామని చెప్పారు.
ఈ సందర్భంగా తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 'ఆ మహానుభావుడు' ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు శాల్యూట్ అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.
కట్ చేస్తే.. నారాయణ మూర్తిపై సటైర్లు పేలుతున్నాయి. సర్.. శంకుస్థాపనలు చేయడం కాదు.. ప్రారంభం ఎప్పుడు చేస్తారో చెప్పిస్తే బాగుండేదని అంటున్నారు. ఎందుకంటే.. శంకుస్థాపనలు చేయడం సులువేనని, కానీ, వాటిని పూర్తి చేయడమే కష్టమని, ఎన్నికలకు ముందు ఎవరైనా.. ఇలానే శంకుస్థాపనలు చేస్తారని అంటున్నారు. మరి దీనిపై నారాయణ మూర్తి ఏమంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.