Begin typing your search above and press return to search.
జగన్ పై ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు
By: Tupaki Desk | 24 March 2021 5:00 AM GMTజగన్ పై ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు దక్కాయి. ఆయన చేసిన పనికి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు ఆ సినీ దర్శకుడు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కింద ఉన్న కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సినీ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం ద్వారా రైతుల్లో జగన్ సంతోషం నింపారని కొనియాడారు.
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని నారాయణమూర్తి ఆరోపించారు. గోదావరి నది ప్రవహించే తూర్పు గోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని అన్నారు.
ఏలేరు-తాండవ అనుసంధాన పనులతో ఇప్పుడా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు జగన్ పూనుకోవడం అభినందనీయం అని కొనియాడారు.ఎమ్మెల్యే దాడిశెట్టి ప్రతిపాదనలతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని నారాయణ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టినందుకు ఈ ప్రాంత ప్రజలు.. తాను సీఎం జగన్ కు రుణపడి ఉంటానని నారాయణ మూర్తి చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరులో సహకరించిన మంత్రులు అనిల్ , కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలేరు-తాండవ జలశాయలా కింద ఉన్న కాలువ అనుసంధాన పనులకు గత వారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.470.05 కోట్లు మంజూరు చేసింది. దీని కింద 51465 ఎకరాల ఆయకట్టు ఉంది.