Begin typing your search above and press return to search.
మోడీ పొరబడ్డారా.. రాహుల్ తడబడ్డారా?
By: Tupaki Desk | 2 March 2017 11:39 AM GMTనిత్యం ఒకరినొకరు విమర్శించుకునే మోడీ, రాహుల్ గాంధీ మధ్య మరో వివాదం మొదలైంది. రాహుల్ గాంధీ అజ్ఞానాన్ని ఎగతాళి చేసేందుకు మోడీ ప్రయత్నించగా.. రాహుల్ అసలు తన అజ్ఞానమేమీ బయటపెట్టుకోలేదని.. మోడీయే తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
ఇటీవల మణిపూర్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్, తన ప్రసంగంలో ఆరంజ్ జ్యూస్ - పైనాపిల్ జ్యూస్ లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ కొబ్బరి జ్యూస్ కూడా అన్నాడంటూ.. కొబ్బరికాయ నుంచి నీరు వస్తుందే కానీ జ్యూస్ రాదని నిన్న మహరాజ్ గంజ్ లో జరిగిన సభలో ప్రధాని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ గా రాహుల్ ప్రసంగం వీడియా లోను ఆధారంగా చూపిస్తున్నారు.
కొబ్బరికాయ నుంచి నీరు మాత్రమే వస్తుందని, జ్యూస్ తీయరన్న కనీస జ్ఞానం రాహుల్ గాంధీకి లేదని గత రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దీంతో మోడీ అబద్ధాల రసాన్ని బాగానే తీస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజిత్ సుర్జేవాలా విమర్శించారు. మోడీ బాధ్యతారహిత ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ 'నారియల్ జ్యూస్' (కొబ్బరి రసం) అనలేదని 'నారంగీ జ్యూస్' (నారింజ రసం) అన్నారని చెబుతూ, రెండు రోజుల నాటి రాహుల్ ప్రసంగం వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/