Begin typing your search above and press return to search.

'ఆర్ వ్యాల్యూ' తగ్గింది..: కరోనా విషయంలో ఊరట..

By:  Tupaki Desk   |   24 Jan 2022 9:30 AM GMT
ఆర్ వ్యాల్యూ తగ్గింది..: కరోనా విషయంలో ఊరట..
X
కరోనా విషయంలో దేశానికి ఊరటినచ్చే విషయం ఇంది.

దేశ వ్యాప్తగా ‘ఆర్ వాల్యూ’ తగ్గుముఖం పట్టింది. దీంతో కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20న 3.47 లక్షల కేసులు ఉంటే.. ఆదివారం 3.33 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆర్ వ్యాల్యూ 2.9 నుంచి 1.57 కు తగ్గింది.

అంటే కరోనా వ్యాప్తిలో ఎక్కువ మందిరికి కాకుండా తక్కువ స్థాయిలో సోకే స్థితికి చేరుకుందని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ ప్రారంభంలో ముంబయ్,కోల్ కతాల్లో కొవిడ్ పతకా స్థాయికి వెళ్లి ఎండమిక్ దశకు చేరుకుందని అంటున్నారు.

అలాగే ఫిబ్రవరి 6 వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా కొవిడ్ పతాక స్థాయికి చేరుకుంటుందని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.

ఒక వ్యక్తికి కొవిడ్ సోకితే ఆ వ్యక్తి ద్వారా ఎంత మందికి ఇన్ఫెక్షన్ ప్రభులుతుందో తెలిపేదే ‘ఆర్ వ్యాల్యూ’. ఇలా ఒకరి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందని ఇది ప్రామాణికంగా తెలుపుతుంది. వాస్తవానికి డిసెంబర్ నెల చివరిలో ‘ఆర్ వ్యాల్యూ‘ పతాక స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.

జనవరి ప్రారంభం నుంచి దీని తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో ఆర్ వ్యాల్యూ సగానికి తగ్గినట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెల చివరి వారంలో ఆర్ వ్యాల్యూ 2.9 గా ఉంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈనెల 7 నుంచి 13వ తేదీల్లో ఇది 2.2 కు చేరింది.

అలాగే 14, 15 తేదీల్లో అది 1.57 గా మారింది. దీంతో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మాత్రమే ఇన్ఫెక్షన్ సోకే ప్రభావం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై కలకత్తల్లో కేసులు తిరుగుముఖం పట్టాయి. ముంబయి నగరంలో 0.67, కోల్ కతాలో 0.56 లకు ఆర్ వ్యాల్యూ పరిమితమైంది. అంటే ఈ రెండు నగరాల్లోకొవిడ్ పతాక స్థాయికి చేరి, ఎండెమిక్ దశకు చేరిందని ఐఐటీ మద్రాస్ అధ్యయన బృందం తెలుపుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసులు పెరిగిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కొత్త కేసులు 2 నుంచి 8 లక్షలు చేరుకున్నా తీవ్ర చూపించదని అంటున్నారు. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెస్ ప్రకారం.. దేశంలో ఒక్కరోజులు 8 లక్షల కేసులు నమోదైనా ఆసుపత్రిల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం 3.5 శాతం మంది మాత్రమే ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. ఇక కొవిడ్ తో ఆసుపత్రుల్లో చేరినా 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గిందని అంటున్నారు. వరుసగా 5 రోజుల పాటు 8 లక్షల కేసులు నమోదైనా ఆసుపత్రుల్లో 1.5 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతారని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఒమైక్రాన్ సామాజిక వ్యాప్తి దశలోకి వెళ్లిందని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఆదివారం వెల్లడించింది. ఒమైక్రాన్ లోని బీఏ.2 వేరియంట్ కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటి ఇన్ఫెక్షన్లే ఉంటున్నాయని,

కానీ కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగిందని తెలిపింది. మరోవైపు ఒమైక్రాన్లోని బి.1.640.2 కు సంబంధించిన కేసులు ఇప్పటి వరకు బయటపడలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా థర్డ్ వేవ్ ఆరువారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 2020 మార్చిలో మొదలైన మొదటి వేవ్ సెప్టెంబర్ రెండో వారంలో తగ్గుముఖం పట్టింది. అలాగే 2021 మార్చిలో మొదలవగా 10 వారాల పాటు కొనసాగింది.

మూడో వేవ్ డిసెంబర్లో మొదలైనందుకు 6 వారాల పాటు కొనసాగి ఆ తరువాత పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.