Begin typing your search above and press return to search.

ఆర్ వాల్యూ హైక్.. మరిన్ని ఆంక్షలు

By:  Tupaki Desk   |   2 Jan 2022 2:30 PM GMT
ఆర్ వాల్యూ హైక్.. మరిన్ని ఆంక్షలు
X
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల పెరుగుతున్న ఆర్ వాల్యూ ను బట్టి కేసులు మరింత పెరిగుతాయని చెబుతున్నారు. మొన్నటిదాకా ఒకటి లోపు ఉంటే చాలా మందికి వైరస్ నిర్ధారణ అయింది. తాజాగా ఈ రిప్రొడక్టివ్ వాల్యూ దేశ రాజధాని దిల్లీలో పైపైకి పోతోంది. ప్రస్తుతం రెండు కి మించి ఉన్నట్లు సమాచారం. ఆర్ విలువ పెరిగిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.

ఢిల్లీ లో ఆర్ వాల్యూ 2ను దాటింది. ఈ నేపథ్యంలో అక్కడ మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం కూడా అలర్ట్ అయింది. వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. తాత్కాలిక కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సూచించింది. పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చుకోవాలని పేర్కొంది. మరోవైపు వైరస్ కట్టడికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆర్ వాల్యూ తో పాటు ఒమిక్రాన్ ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉత్తరప్రదేశ్ లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే వారంలో దీనిపై సమీక్షించనున్న ట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నా... భయపడాల్సిన అవసరం లేదని అక్కడి గవర్నమెంట్ భరోసానిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి బట్టి... నిబంధనలు వర్తింపజేస్తుంది. పెరుగుతున్న కేసుల కారణంగా మూడో ముప్పు పొంచి ఉందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కాగా మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణలో పలు ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సభలు- సమావేశాలు, ర్యాలీ, రాజకీయ-సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం వంటివాటిని నిషేధించింది. ఈ నిబంధనలు ఈనెల 10 వరకు అమల్లో ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.