Begin typing your search above and press return to search.

ప్రధాని అడ్రస్ ను మార్చేసిన సీఎం

By:  Tupaki Desk   |   22 Sep 2016 10:06 AM GMT
ప్రధాని అడ్రస్ ను మార్చేసిన సీఎం
X
అవును.. మీరు చదివింది నిజమే. ప్రధాని అడ్రస్ మారింది. మోడీ అడ్రస్ మారటమేంటన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇందులో ఒక ఆసక్తికర కోణం ఉంది. దేశ ప్రధాని చిరునామా చెప్పమంటే.. చెప్పగలిగేవారి నోట నుంచి ‘‘రేస్ కోర్స్ రోడ్’’ అనే మాట తప్పనిసరిగా వస్తుంది. ఇకపై అలా చెబితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఢిల్లీ సర్కారు తాజాగా ప్రధాని నివాసం ఉంటున్న వీధిపేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిత్యం ప్రధాని మోడీ మీద విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని మోడీ నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్ ను.. లోక్ కల్యాణ్ మార్గ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం నేతృత్వంలో జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.

1940లో ఢిల్లీలోని రేస్ క్లబ్ కు గుర్తుగా రేస్ కోర్స్ రోడ్ గా పేరు పెట్టారు. అనంతరం 1984లో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక రేస్ కోర్స్ రోడ్ లోని 7వ నివాసంలో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ప్రధాని మోడీ రేస్ కోర్స్ రోడ్ లోని 7వనెంబరుల ఇంట్లో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకోగా.. 5వ నెంబరును ఇంటిని కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే.. ఈ రోడ్డును రేస్ కోర్స్ రోడ్ స్థానే.. లోక్ కల్యాణ్ మార్గ్ గా మారుస్తూ కేజ్రీ సర్కారు నిర్ణయం తీసుకున్నావారు. నిజానికి ఈ రోడ్డుకు ఏకాత్మా మార్గ్ గా పేరు పెట్టాలని ఈ ప్రాంతానికి ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత మీనాక్షీ లేహి ప్రయత్నించారు. అయితే.. కేజ్రీవాల్ సర్కారు మాత్రం అలా వద్దంటూ.. తాను ఎంపిక చేసిన పేరును పెట్టుకుంది. దీంతో.. మోడీ అడ్రస్ మారిపోయింది.