Begin typing your search above and press return to search.

భారతీయ పిల్లలను వదలరా? అమెరికా స్కూల్లలోనూ తగ్గని జాత్యహంకారం..

By:  Tupaki Desk   |   20 Dec 2022 11:30 AM GMT
భారతీయ పిల్లలను వదలరా? అమెరికా స్కూల్లలోనూ తగ్గని జాత్యహంకారం..
X
తెల్లతోలు కప్పుకున్న అమెరికన్లు తమ రంగు కాని వారిని అవమానిస్తున్నారు. ఈసడిస్తున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులకు అవమానాలు తప్పడం లేదు. అక్కడి జాత్యహంకారం తగ్గడం లేదు. స్కూలు దశలోనూ భారతీయ పిల్లలను అవమానిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువ భారతీయ-అమెరికన్‌లు ప్రీస్కూల్‌లోనే జాతి పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇది భారతీయులను షాక్ కు గురిచేస్తోంది.

అమెరికాలో నివసిస్తున్న 3.5 మిలియన్లకు పైగా దక్షిణాసియావాసులలో ఉన్న యువ భారతీయ-అమెరికన్‌లు, ప్రీస్కూల్‌ దశలోనే క్రమం తప్పకుండా జాతి వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి గుర్తింపుల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. రెండోతరం భారతీయ-అమెరికన్ యుక్తవయస్కులు "ప్రత్యేకంగా తమ గుర్తింపును అన్వేషించడం.. ఏర్పరచుకోవడం వలన వివక్షకు గురవుతున్నారని తేలింది. ఈ అధ్యయనం 12-17 సంవత్సరాల మధ్య వయస్సు గల తొమ్మిది మంది భారతీయ-అమెరికన్‌లను సర్వే చేసింది. వారు పాఠశాలలో తోటివారితో తమ అనుభవాల గురించి మాట్లాడారు. వారు భారతీయ సంస్కృతి, భాష లేదా మతం గురించి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారని తేలింది.

"ఒక్క రాయిని చూపించి 'ఇదిగో ఇది నీ దేవుడు' అని అవమానిస్తున్నారని.. కొన్ని నల్లచుక్కలున్నాయి.. వారిని దూరంగా పెట్టాలి అని ఒక తెల్ల అమెరికా పిల్లవాడు అన్నాడని పలువురు భారతీయ పిల్లలు సర్వేలో బాధను వెళ్లగక్కారు. ఇదే నీ దేవుడా?' అని నుదిటిపై ఉంచి కొందరు అవమానించారని" అని ఒక భారతీయ అమెరికన్ విద్యార్థి వాపోయాడు.

ఆహారం గురించి.. భారతీయ యాసను వెక్కిరిస్తారని.. 'నాకు భారతీయ ఆహారం ఇష్టం లేదు' అని కొందరు తిట్టిపోస్తారని.. 'ఇది చాలా దుర్వాసనగా ఉందని అవమానిస్తారని మరికొందరు విద్యార్థులు ఆవేదన చెందారు. ద్వేషపూరిత నేరాలను నివేదించడమే కాకుండా యుక్తవయస్కులు తమ భారతీయ గుర్తింపును అమెరికన్‌గా చూడాలనే కోరికను వెలిబుచ్చారు. వారు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా చర్చించారు. వారిలో కొందరు తమ స్నేహితుల వలె తెల్లటి చర్మం కలిగి లేరని.. ప్రీస్కూల్‌లోనే "అమెరికన్"గా ఉండాలనే కోరికతో కోపంగా ప్రవర్తిస్తున్నారని నివేదించారు..

'ఇంటర్వ్యూ చేసినవారు కుటుంబంతో.. పాఠశాలలో ఉన్నప్పుడు విభిన్నంగా మాట్లాడేవారు.. ప్రవర్తించారని' జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం తెలిపింది. "ఇండియన్-అమెరికన్ అనే పదం మీరు రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారని అర్థం, మీ తల్లిదండ్రులు పాశ్చాత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు.. పాశ్చాత్య ప్రపంచం భారతీయ ప్రపంచాన్ని అర్థం చేసుకోదు, మీరు రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారు. ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మీకు జ్ఞానం ఉండాలి వాటిని బ్యాలెన్స్ చేయండి" అని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ఈ కౌమారదశలో ఉన్నవారు తాము ఏ సమూహానికి సరిపోరని భావించారు. భారతీయ-అమెరికన్ యువత ప్రీస్కూల్ , ఎలిమెంటరీ స్కూల్‌లోనే వివక్షను ఎదుర్కోవడం తరుచుగా జరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. ఈ కౌమారదశలో ఉన్నవారు అందరూ రెండోతరంగా వర్గీకరించబడుతున్నారని తేలింది. వారు అమెరికాలో జన్మించారు. 18 సంవత్సరాల వయస్సు తర్వాత భారతదేశం నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు పుట్టారు. వీరు కూడా ఇక్కడ వివక్షకు గురవుతున్నట్టు తేలింది.

ఆసియా భారతీయులు 1800 చివరలో అమెరికాకు వలస వచ్చిన మొదటి దక్షిణాసియా వాసులు. ప్రస్తుతం అమెరికాలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నట్టు తేలింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.