Begin typing your search above and press return to search.
అమెరికాలో మళ్లీ మారణహోమం.. దుండగుడి కాల్పుల్లో 8 మంది మృతి..!
By: Tupaki Desk | 17 March 2021 4:31 AM GMTఅమెరికాలో జాత్యంహకార దాడులు సాధారణమే. తరచూ ఏదో ఒక రాష్ట్రంలో తెల్లజాతీయులు, నల్ల జాతీయులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం అక్కడ పరిపాటి. అయితే నూతన అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఇటువంటి ఘటనలు జరగలేదు. అయితే తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాటా సిటీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఓ మసాజ్సెంటర్లు, స్పా సెంటర్లలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఇప్పటివరకు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది. గతంలో పాఠశాలల్లో పబ్‌లలో జాత్యంహకార దాడులు జరిగేవి. తాజాగా మరోసారి ఇటువంటి ఘటన జరగడంతో అమెరికా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చనిపోయిన వాళ్లల్లో ఆసియా వాసులు కూడా ఉన్నట్టు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అట్లాటా సిటీ లోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి రాబర్ట్ అరోన్ లాంగ్ (21) అనే వ్యక్తిని పోలీసులు అదుపు లోకి తీసుకొన్నారు. అట్లాటా సిటీలోని చైజర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గోల్డ్ స్పా, దానికి కొద్దిగా దూరంలోని అరోమా థెరపీ స్పా, మరో మసాజ్ సెంటర్లలో ఈ కాల్పులు జరిగాయి. చనిపోయిన వారంతా మహిళలే కావడం గమనార్హం. అయితే ఓ దుండగుడు స్పా, మసాజ్ సెంటర్లోకి చొరబడి మహిళలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిది. ఆ లోపే దుండగుడు కూడా పారిపోయాడు. చనిపోయిన వాళ్లంతా ఆసియాకు చెందని వాళ్లే కావడంతో ఇది జాత్యంహకార దాడి అని అనుమానిస్తున్నారు. గత ఆదివారం చికాగోలోనూ ఇటువంటి ఘటన జరిగింది. ఓ దుండగుడు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే జో బైడెన్ హాయం లో ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే తొలి సారి. మృతుల్లో ఆసియా వాసులు ఉండటం తో అమెరికా లోని భారతీయుల్లో టెన్షన్ నెలకొన్నది.