Begin typing your search above and press return to search.
ఇండియన్ ఫుట్ బాల్ టీం కెప్టెన్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 20 May 2020 9:30 AM GMTఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి పై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసారు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అతణ్ని ఉద్దేశించి..ఎవరీ నేపాలీ అంటూ ఓవరాక్షన్ చేశాడు. దీనితో ఈ వ్యవహారం పై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది.
గత 13 ఏళ్లుగా ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టీమ్ లో అద్భుతంగా ఆడుతూ.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సారథిగా వ్యవహరిస్తోన్న ఓ గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం మంచి పద్దతి కాదు అంటూ నెటిజన్లు ఫైరయ్యారు. దీనితో ఆ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ చేసి వెళ్లిపోయాడు. ఇక ఈ చాట్ లో భాగంగా ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు విరాట్ ఆన్సర్స్ ఇచ్చాడు.
జూనియర్ లెవల్ లో ఆడుతున్నప్పుడు తన తండ్రి లంచం ఇవ్వనందుకు ఓసారి తనకు టీమ్ లో చోటివ్వలేదని కోహ్లి ఈ చాట్ లో వెల్లడించాడు. అలాగే సచిన్ ఇన్నింగ్స్ ల్లో షార్జా సెంచరీ (144) తనకు చాలా ఇష్టమని తెలిపాడు. అలాంటి ఇన్నింగ్స్ నేనూ కూడా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానించడానికి అతడి దూకుడే కారణం అని కోహ్లి తెలిపాడు.